కామేశ్వరి దేవిగా గాయత్రీ మాత దర్శనం
ఘట్కేసర్ రూరల్, మేజర్ న్యూస్: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ గాయత్రీ మాత ఆలయంలో ఆదివారం అమ్మవారు కామేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ పూజలతో పాటు నవచండీ హోమం, నిత్య కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం వెంకటేశ్వర్లు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, సిద్ధి రాములు గుప్తా, నర్సింహారావు, బిక్షపతి గుప్తా, మోహన్ రావు, నాయకులు పాశం లక్ష్మణ్ యాదవ్, కార్తిక్ పంతులు, కౌశిక్ పంతులు, రామ్మూర్తి పంతులు, ప్రసాద్ పంతులు, వేణుగోపాల్ పంతులు, వినీల్, కౌశల్, నవనీత్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.