BREAKING
అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు!

జిల్లా విద్యాశాఖాధికారి  కార్యాలయంలో బతుకమ్మ పండుగ వేడుకలు

Select Suryaa Now
జిల్లా విద్యాశాఖాధికారి  కార్యాలయంలో బతుకమ్మ పండుగ వేడుకలు
హిమాయత్ నగర్ ,మేజర్ న్యూస్ :హైదరాబాద్‌లోని జిల్లా విద్యాశాఖాధికారి  కార్యాలయంలో టీజీఎన్‌జీవోస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ ప్రెసిడెంట్ మరియు టీజీఎన్‌జీవోస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తెలంగాణ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు కె.ఆర్. రాజ్‌కుమార్, కార్యదర్శి  ఎం.డి. ఫక్రుద్దీన్ అహ్మద్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మాతా లలితా త్రిపుర సుందరి దేవి పూజా కార్యక్రమం, బతుకమ్మ పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరితంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీఎన్‌జీవోస్ యూనియన్ కేంద్ర సంఘం అధ్యక్షులు  మారం జగదీశ్వర్ , కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డా. ఎస్.ఎం. హుస్సేని ముజీబ్ ,కేంద్ర సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్  వెంకటేశ్  హాజరయ్యారు. డా. ఎస్.ఎం. హుస్సేని ముజీబ్ అన్న మాట్లాడుతూ, టీజీఎన్‌జీవోస్ యూనియన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు ఉద్యోగులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి పండుగలను ఐకమత్యంతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఉద్యోగులందరూ పరస్పర స్నేహభావంతో, ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.