telanagana
జైత్వారంలో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
జైత్వారంలో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
కందుకూరు: కందుకూరు మండలంలోని జైత్వారం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మహిళలు సంప్రదాయ బతుకమ్మ ఆటలు, పాటలతో సందడి చేశారు. బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి గంగవడిలో నిమజ్జనం చేశారు. గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్