BREAKING
ఉచిత వైద్య శిబిరాలు రోగులకు ఎంతో మేలు తూప్రాన్ లో విద్యుత్ కోతులను నిరసిస్తూ ఆందోళన క్షయ వ్యాధి రహిత భారత్‌ లక్ష్యంగా ‘జోష్’ టీముల ఏర్పాటు చిన్నారుల ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో ముఖ్యం తూప్రాన్ విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజా బాట టీబీ ముక్త భారత్‌ అభియాన్‌లో జోష్ టీమ్‌ ప్రారంభం ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధికి 7 కోట్లు నిధులు వెట్టిచాకిరీ నిర్మూలనకు ‘స్వేచ్ఛా రథం’ పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం పోషణ మాసోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జ్యోతి నగర్ అంగన్వాడి కేంద్రంలో ముగిసిన 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నీటి కోసం పాట్లు..!అర కిలోమీటర్ విద్యార్ధినుల నడక..! శనీశ్వర స్వామి వారి దర్శించుకున్న మెప్ప డైరెక్టర్ గ్రామీణ కళాకారులను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

హౌస్ సర్జన్ వైద్యులకు సమాన పారితోషాకాన్ని చెల్లించాలి…ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యుల నిరసన....

Select Suryaa Now
హౌస్ సర్జన్ వైద్యులకు సమాన పారితోషాకాన్ని చెల్లించాలి…ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యుల నిరసన....

జాతీయ మెడికల్ కౌన్సిల్ సూచించిన విధంగా ఇంటర్ షిప్ కాలంలో ప్రతి గ్రాడ్యుయేట్ వైద్యునికి స్టైఫెండ్ పారితోషికాన్ని చెల్లించాలని ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సాయి శశాంక్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కార్తీక్ చంద, కార్యదర్శి డాక్టర్ నితిన్ రెడ్డి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కు చెల్లిస్తున్న పారితోషకంను సమాన స్థాయిలో పనిచేస్తున్న ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కు సమాన స్టైఫండ్ అందజేయాలని గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిరసన వ్యక్తం చేశారు.2026 జనవరి నుండి నేటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్టేఫండ్ స్వీకరించలేదని, పస్తులతో విధులు నిర్వహిస్తున్నామని, సమాన వైద్య సేవలకు సమాన పారితోషికం 29వేల 792 రూపాయలు చెల్లించి సరైన న్యాయం కల్పించి, వెంటనే పారితోషికం నిధులు విడుదల చేసి ఆదుకోవాలని వారి డిమాండ్ చేశారు. ఆసుపత్రులలో క్యాజువాలిటీ,ఇంటెన్సిస్ కేర్ యూనిట్, అన్ని విభాగాల ఓపి సేవలు 24 గంటల పాటు అందిస్తున్నామని వారు అన్నారు.ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వం పారితోషికం ఇవ్వకపోవడం నిర్లక్ష్య వైఖరికి దర్పణం కనిపిస్తుందని అన్నారు.ప్రభుత్వం వైద్యుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని వారి డిమాండ్ చేశారు. మొదటి మూడు రోజులు ఓ.పి సేవలు ఇంటెన్సీవ్ వైద్యులు ఆపుదల చేస్తామని,ప్రస్తుతం అత్యవసర క్యాజువల్టీ సేవలు రోగులకు అందిస్తున్నామని అన్నారు.న్యాయపరమైన విషయాన్ని ప్రభుత్వం గమనించి వెంటనే స్టైఫెండ్ విడుదల చేయాలని వారు కోరారు.విషయం పరిష్కారం కాకపోతే ఆరోగ్య సేవలు పూర్తిస్థాయిలో ఆపదల చేస్తామని,రాష్ట్ర వైద్య సంచాలకుల కార్యాలయం ముందు భారీ ఎత్తున నిరసన చేయుటకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంటెన్సివ్ వైద్యులు డాక్టర్ సమీర్, డాక్టర్ హిమాని,డాక్టర్ అక్షిత, డాక్టర్ నవీన్, డాక్టర్ ఉన్నతి, డాక్టర్ నయుం, డాక్టర్ జైపాల్ రెడ్డి, డాక్టర్ ప్రేమిక, డాక్టర్ ఫిలిప్స్, డాక్టర్ అమన్, డాక్టర్ సంతోష్, డాక్టర్ శివాని, డాక్టర్ నికిత,ఇతర వైద్యులు,తదితరులు పాల్గొన్నారు.

పి వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్.