దుర్గామాత పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల: చేర్యాల మండలంలోని ఆకునూర్, ముస్త్యాల గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన దుర్గామాత పూజా కార్యక్రమాల్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలునిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో సుఖశాంతులు, ఐక్యత వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.