దుర్గాదేవి అలంకరణలో జగదాంబ మాత
ఘట్కేసర్ రూరల్, మేజర్ న్యూస్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ శ్రీ జగదాంబ మాత, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో నిర్వహిస్తున్న దుర్గామాత నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఎనిమిదో రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించగా, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల ఆధ్యాత్మిక నామస్మరణలు, పూజలతో ఆలయ ప్రాంగణం భక్తిభావంతో పులకించింది. అనంతరం నానవత్ జితేందర్ నాయక్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గుగులోత్ గోవింద్ నాయక్, అన్నదాత జితేందర్ నాయక్ మాట్లాడుతూ.. తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలకు దాతలు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, బంజారా యూత్, గ్రామ పెద్దలు, భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. అందరి సమష్టి కృషితో ఉత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, సహకార సంఘం మాజీ డైరెక్టర్ బోయపల్లి సత్తిరెడ్డి, సూర్య యూత్ అధ్యక్షులు బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, కే.ఎం.రెడ్డి, నానవత్ దేవుసింగ్ నాయక్, నానవత్ రమేష్ నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు అంగోత్ లక్ష్మణ్ నాయక్, విశ్లావత్ జగన్ నాయక్, సీతారాం నాయక్, నానవత్ సంతోష్ నాయక్, విశ్లావత్ రవి నాయక్, ధరం సోత్ వికాస్, విశ్లావత్ ప్రశాంత్, టీం సేవాలాల్ అధ్యక్షుడు సంతోష్ నాయక్, ప్రధాన కార్యదర్శి రాకేష్ నాయక్, కోశాధికారి వినోద్ నాయక్, గురుస్వామి దేవుసింగ్, రాజు, బంజారా యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.