BREAKING
అబుదాబిలో ఒడిశా కీలక ఒప్పందం జర్మనీ రాష్ట్ర ఎన్నికల్లో అతివాద పార్టీ విజయం విదేశాంగ విధాన సాధనంగా అమెరికా ఆర్థిక శక్తి ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు త్వరలోనే పునఃప్రారంభం రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం బ్రిక్స్ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం సౌదీ చమురు కేంద్రాలపై హౌతీల దాడులను ఖండించిన భారత్ నేపాల్ వరద బాధితులకు భారత్ అండ మల్లాపూర్లో డీలా పడ్డ గులాబీ తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై శ్రీకృష్ణుడి విగ్రహం దెబ్బతినడంపై టీటీడీ స్పష్టత.. ఎటువంటి నిర్లక్ష్యం లేదని వెల్లడి! కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు.. శాస్త్రోక్తంగా పూర్ణాహుతి బిగ్‌బాస్ హౌస్‌లో మొదలైన రచ్చ.. నామినేషన్లు, గొడవలతో హీటెక్కిన వాతావరణం! రేవంత్ ఉచ్చులో ‘కారు’ పడినట్లేనా? ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై వేగంగా కసరత్తు! యుద్ధ మేఘాలు.. సెంచరీ దాటిన క్రూడాయిల్ ధరలు!

మల్లాపూర్లో డీలా పడ్డ గులాబీ

Select Suryaa Now
మల్లాపూర్లో డీలా పడ్డ గులాబీ


 

 
 
 
 
సూర్య మల్లాపూర్:
 
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజురోజుకీ డీలా పడుతుందని చర్చ జోరుగా సాగుతోంది. గతంలో కదం తొక్కిన పార్టీ ఇప్పుడు కార్యకర్తలకు దూరమవుతోందని సొంత కేడరే ఆవేదన వ్యక్తం చేస్తోంది. మండలంలో పార్టీ కార్యక్రమాలు నామమాత్రంగా మారాయని, ప్రజా సమస్యలపై నాయకత్వం స్పందించడం లేదని కింది స్థాయి నాయకులు అంటున్నారు. ప్రస్తుత నాయకత్వం వల్ల పార్టీ బలహీనపడుతోందని యువకులకు, సీనియర్లకు సమన్వయం కుదిర్చే కొత్త నాయకుడు వస్తేనే పార్టీకి పూర్వ వైభవం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. ఏళ్ల తరబడి ఒక్కరే మండల నాయకత్వం వహించడంతో కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కార్యక్రమాలు కూడా అనుకున్న స్థాయికి చేరుకోలేదని చర్చలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ మండల కేంద్రానికి చెందిన నాయకులు స్పందించి ఫిర్యాదు చేయడం. మండల నాయకత్వం వహించే నాయకుడు బాధ్యత వహించకపోవడంతో పార్టీని కాపాడుకోవాలంటే నాయకత్వ మార్పు అనివార్యమని శ్రేణులు బహిరంగంగానే చెబుతున్నాయి. పార్టీ లో విభేదాలు తలెత్తకుండా ఏకతాటిపై కార్యకర్తలు నడవడానికి అధిష్టానం‌ ఎ విధమైన చర్యలు తీసుకుంటుందోనని బిఆర్ఎస్ నాయకులు ఎదురు చూస్తున్నారు.