BREAKING
ఆటోల్లో ప్రమాదకర ప్రయాణం! పియు లో సౌత్ జోన్ ఎంపికలు చిన్న శ్రీను, సిరమ్మ సమక్షంలో టీడీపీలో చేరిన 600కు పైగా కుటుంబాలు చాపిరి చెరువుకు కృష్ణా జలాలు.. రైతుల హృదయాల్లో అమిలినేనికి ప్రత్యేక స్థానం రైతుల సంక్షేమానికి ఎమ్మెల్యే అమిలినేని చేస్తున్న కృషి అభినందనీయం ఘనంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు బోరంపల్లి రైతుల సన్మానం భోగాపురం విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత! పూలు పండ్లు అమ్మే వ్యాపారస్తుల వద్దకు వెళ్లి ఓటును అభ్యర్థించిన మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి. ప్రజల నమ్మకాన్ని నిలుపుకుంటాం.. కదిరి వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అత్తర్ పర్వీన్ యేసుప్రభు ఆశీర్వాదం పొందిన వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ బియ్యం అక్రమార్కులపై సీఐడీ ఉక్కుపాదం.. పలు జిల్లాల్లో దాడులు! యాక్షన్ కింగ్ అర్జున్ రెండో కుమార్తె అంజనా వివాహం.. విదేశీయుడితో గ్రాండ్‌గా వెడ్డింగ్! నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై ఘట్టమనేని గౌతమ్ రివ్యూ.. సూపర్ స్టార్ వారసుడి ప్రశంసలు! విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు.. తాగునీటి సమస్యే కారణం! విజయ్ సేతుపతి ‘బత్తా’ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్! కూటమి సర్కార్‌కు ప్రజల ఆగ్రహం తప్పదు-మాజీ ఎమ్యెల్యే శిల్పా రవి రెడ్డి 9 వార్డు వెస్ట్ మారెమ్మపల్లి లో చైర్మన్ అభ్యర్థితో కలిసి ఓటర్లను కలిసిన కూటమి అభ్యర్థులు.

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య.

Select Suryaa Now
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య.

కళ్యాణదుర్గం: అప్పుల భారం, పంటల సాగులో ఎదురైన నష్టాలు ఓ కౌలు రైతు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామానికి చెందిన కౌలు రైతు అశోక్‌ (33) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్షాలు సరిగా కురవకపోవడంతో పంటలు నష్టపోయి, సాగు కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చలేక మనస్తాపానికి గురైన ఆయన చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. అశోక్‌కు సొంత పొలంతో పాటు మరో 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాడు. పంటలు సాగు చేసి కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు అప్పులు తీర్చవచ్చని ఆశపడ్డాడు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఆశించిన స్థాయిలో పండకపోవడంతో పెట్టుబడులు తిరిగి రాలేదు. కౌలు చెల్లింపులు, సాగు ఖర్చులు, ఇతర అవసరాల కోసం చేసిన అప్పులు పెరిగి సుమారు రూ.20 లక్షల వరకు చేరినట్లు సమాచారం. పంటల ద్వారా ఆదాయం రాకపోవడం, మరోవైపు అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఎదురవడంతో ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. అప్పుల భారాన్ని భరించలేక మనస్తాపంతో అశోక్‌ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన మృతితో ముదిగల్లు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతు కుటుంబంలో చోటుచేసుకున్న ఈ ఘటన గ్రామస్థులను కలచివేసింది. కౌలు రైతులు పెట్టుబడుల కోసం అప్పులు చేసి, ప్రకృతి అనుకూలించక పంట నష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు సకాలంలో ప్రభుత్వ సహాయం, పంట నష్ట పరిహారం, రుణ సంబంధిత వెసులుబాట్లు అందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోవడంతో అశోక్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల విచారణ సమాచారం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
కళ్యాణదుర్గం సూర్య ఇంచార్జ్ :- సుధామోహన్.