దుర్గ మాత చీరను 35 వేలకు దక్కించుకున్న కటిక రాజు
కోయిల్ కొండ సూర్య న్యూస్ :
మండలంలో ఉన్న పారుపల్లి గ్రామపంచాయతీలో ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఏర్పాటుచేసిన దుర్గామాత చీరను వేలం పాటలో 35 వేల రూపాయలకు జన సేన పార్టీ నాయకులు రాజు రారాజు కటిక రాజు దక్కించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుర్గామాత రాజరాజేశ్వరిగా భక్తులకు దర్శించిన చీరను వేలం పాటలో తీసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా అమ్మవారికి వడి నింపిన బియ్యంతో శనివారం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు, అనంతరం వేలంపాటలో దక్కించుకున్న చీరను నిర్వాహకులు తమకు అందజేయడం జరిగిందని తెలిపారు. పారుపల్లి గ్రామంలో ఉన్న ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నానని ఆయన తెలిపారు.