చిట్టిగిద్దలో వివాహిత అనుమానాస్పద మృతి
వికారాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తొలుత మృతదేహాన్ని వికారాబాద్ పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, అక్కడి నుంచి తిరిగి నవాబుపేట పోలీస్ స్టేషన్కు ఆమె బంధువులు తీసుకెళ్తున్నట్లు సమాచారం.వివాహిత మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటన హత్యా, ఆత్మహత్యా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.