BREAKING
అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన... జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం... ప్రధానమంత్రి పుట్టిన రోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెండింగ్‌ నోటీసులు, విచారణలను వేగవంతంగా పూర్తి చేయాలి చెరువులో చేప పిల్లలను వదిలిన వైద్య సిబ్బంది!

బేల మీదుగానే రైల్వే లైన్ నిర్మించాలి.

Select Suryaa Now
బేల మీదుగానే రైల్వే లైన్ నిర్మించాలి.
సూర్య బేల : ఆదిలాబాద్ నుంచి జైనథ్,బేల మీదుగా గడ్ చందూర్ వరకు రైల్వే లైన్ నిర్మించాలనే డిమాండ్‌తో యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌ రెడ్డి పోస్ట్‌కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పోస్ట్‌కార్డులు  రాయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రైల్వే లైన్ నిర్మాణం జరిగితే బేల,జైనథ్ బోరజ్ మండలాలతో పాటు ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతోపాటు విద్య,వైద్యం,వ్యాపార రంగాలకు ప్రయోజనం చేకూరుతుందనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రూప్ రావు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు అశోక్ పటేల్,  సర్పంచ్ గోడే అవినాష్  మేకల జితేందర్, నయన్,నవనీత్ తదితరులు ఉన్నారు.