గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
వింజమూరు మేజర్ న్యూస్ : వింజమూరు తెలుగుదేశం పార్టీ మండల మాజీ కన్వీనర్ గా సొసైటీ మాజీ చైర్మన్గా పనిచేసిన గొంగటి రఘునాథరెడ్డి గత నెల 22వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే కాగా బుధవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయన స్వగృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు గురువారం జరిగే ఉత్తర క్రియల ఈ కార్యక్రమంపై రఘునాథరెడ్డి తనయుడు దీపక్ రెడ్డితో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని కష్టకాలంలో ముందుండి నడిపించిన నాయకునిగా పార్టీకి వెన్నెముకగా విశేష సేవలు అందించిన రఘునాథరెడ్డి మరణించారన్న విషయం జీర్ణించుకోలేనిదని పార్టీ కోసం ఆయన నిబద్ధతతో గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకుంటూ అనేక రకాలుగా పార్టీకి సేవలు అందించిన నాయకుడు అని తెలిపారు మీ కుటుంబానికి ఎప్పుడూ తోడుగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ ఎన్నం రామచంద్రారెడ్డి దంతులూరి వెంకటేశ్వరరావు రెడ్డి కేశవరెడ్డి ఎనగనూరి మోహన్ రెడ్డి గురజాల గోపి ఎన్ని పెళ్లి పెంచలరావు షేక్ షరీఫ్ తదితరులు ఉన్నారు.