బీజేపీ బొల్లారం పట్టణ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి
జిన్నారం మేజర్ న్యూస్:బొల్లారం పబ్లిక్ స్కూల్‌లో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రభుకుమార్ ఆహ్వానం మేరకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల బతుకమ్మ ఆటలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ... చదువుతోపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని, వారిని గౌరవిస్తూ కంటికి రెప్పలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం బొల్లారం ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.