BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

అమీన్పూర్ శోభాయాత్రకు ముఖ్య అతిథిగా హరీష్ రావుఆహ్వానించిన తుమ్మల పాండురంగారెడ్డి

Select Suryaa Now
అమీన్పూర్ శోభాయాత్రకు ముఖ్య అతిథిగా హరీష్ రావుఆహ్వానించిన తుమ్మల పాండురంగారెడ్డి

అమీన్ పూర్;అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద ఈనెల 22న అమ్మవారి శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా మాజీ మంత్రి హరీష్ రావు ను నిర్వాహకులు ప్రముఖ నాయకులు తుమ్మల పాండురంగారెడ్డి స్వయంగా ఆహ్వానించారు. ఈ శోభాయాత్రను విజయవంతం చేసేందుకు స్థానిక భక్తులు మరియు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. అమీన్పూర్ పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలు వెల్లివెరిసెల అమ్మవారి శోభాయాత్రను ఎంతో కనుల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. కులమత రాజకీయ వివాదాలకు అతీతంగా ప్రజలంతా ఈ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రాంతంపై ఎంతో అభిమానంతో ఆహ్వానాన్ని మన్నించి హాజరవుతున్న మాజీ మంత్రి హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అమీన్పూర్ ప్రజలందరికీ అమ్మవారి దివ్య ఆశీస్సులు లభించి నియోజకవర్గ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన పేర్కొన్నారు.