BREAKING
అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు.. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు.. సెబీ నూతన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ఫ్రేమ్‌వర్క్: సవరించిన ట్రేడింగ్ వేళలు, వీడబ్ల్యూఏపీ నిబంధనలు, డెరివేటివ్స్ కటాఫ్ వివరాలివే! సౌదీ అరేబియా విమాన సర్వీసులపై భారత ఎంబసీ కీలక ప్రకటన: రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా విమానాలు అక్టోబర్ 24 వరకు రద్దు! నేటి రాశి ఫలాలు – 16 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 16 అక్టోబర్ 2026 ప్రైవేట్ మూలధన సమీకరణ, ఉద్యోగాల కల్పనపై ప్రపంచ బ్యాంక్ దృష్టి సారించాలి: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం! మెహ్లీ మిస్త్రీకి అభ్యంతరాలు వ్యక్తం చేసే చట్టబద్ధమైన అర్హత లేదు: టాటా ట్రస్ట్స్ తీవ్ర అభ్యంతరం.. వివాదంలో కీలక మలుపు! సౌదీ అరేబియాలో భారత పౌరులకు కీలక సూచన: గగనతల దాడుల ముప్పు వేళ ఇళ్లలోనే ఉండాలని ఎంబసీ తాజా మార్గదర్శకాలు! అమెరికాలో హిందూ దేవాలయంపై భారీ కాల్పుల కుట్ర భగ్నం: 19 ఏళ్ల శ్వేతజాతి దురహంకారి అరెస్ట్. ఆర్సీహెచ్‌పీలో ఘనంగా శరన్నవరాత్రి పూజ నేపాల్‌లో భారత పెట్టుబడులను మరింత విస్తరించండి: భారతీయ పారిశ్రామికవేత్తలకు నేపాల్ ఆర్థిక మంత్రి ఖనాల్ పిలుపు.. వంగపల్లి గ్రామ యువకుడి హత్య...... కొత్తగూడెం కవికి దాశరథి-సినారె గజల్ పురస్కారం లక్క పల్లి లో భూ సర్వేలపై గ్రామసభ ఐసీసీ నిబంధనల ఉల్లంఘన.. ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ అఫ్సర్‌పై అధికారిక మందలింపు!

అల్వాల్ ప్రీమియర్ లీగ్ – 2026, సీజన్–7 క్రీడా పోటీలు

Select Suryaa Now
అల్వాల్ ప్రీమియర్ లీగ్ – 2026, సీజన్–7 క్రీడా పోటీలు
హైదరాబాద్ /ఆల్వాల్, మేజర్ న్యూస్ : అల్వాల్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలోగురువారం బొల్లారంలోని జీసీసీ గ్రౌండ్‌లో నిర్వహించిన అల్వాల్ ప్రీమియర్ లీగ్ (ఎపిఎల్ ) – 2026, ఏడవ సీజన్ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లీగ్‌లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన క్రీడాకారులకు, జట్లకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే సామర్థ్యం పెంపొందుతాయని తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని యువ క్రీడాకారులకు సూచించారు.
స్థానిక యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ, క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక కల్పిస్తున్న అల్వాల్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ నిర్వాహకులను ఎమ్మెల్యే  అభినందించారు. ఇలాంటి క్రీడా పోటీలు యువతలో ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించడంతో పాటు, స్నేహభావం, ఐక్యత, పరస్పర సహకారాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహించి యువతను ప్రోత్సహించాలని ఆకాంక్షించారు.
అల్వాల్ ప్రీమియర్ లీగ్ ఏడవ సీజన్‌లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనగా, విజేతలకు బహుమతుల ప్రదానం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
 
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఫ్రాంక్లిన్, లియోనార్డ్, దినకర్, సామ్యూల్, ఆనంద్, బీఆర్ఎస్ నాయకులు తోట నరేందర్ రెడ్డి, అరుణ్ రావు, భాస్కర్ రెడ్డి, శోభన్ బాబు, మహేష్, శరణ గిరి, ప్రశాంత్, అరుణ్, అజయ్ గౌడ్, మణికంఠ, క్రీడాకారులు, యువత తదితరులు పాల్గొన్నారు.