ఆయిల్ ఫామ్ సాగులో అధిక దిగుబడులు
భీమదేవరపల్లి, మేజర్ న్యూస్ సూర్య, ఆయిల్ఫామ్ సాగులో నిర్ణీత సమయంలో పోషకాలు అందించి, నీటి యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏరిస్ ఆగ్రో రీజినల్ మేనేజర్ రాజారెడ్డి తెలిపారు. గురువారం ముల్కనూర్ సహకార సంఘం ప్రధాన కార్యాలయంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి మూడు నెలలకోసారి ప్రాథమిక, ద్వితీయ, సూక్ష్మ పోషకాలను అందించాలని సూచించారు. బోరాన్, మెగ్నీషియం, పొటాషియం లోపాలను నివారించే పద్ధతులతోపాటు కీటకాలు, తెగుళ్ల నియంత్రణపై వివరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి, జీఎం మారుపాటి రాంరెడ్డి, కంపెనీ సిబ్బంది, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్; రామకృష్ణ ,బీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా