ఆపదలో ఉన్న పేద కుటుంబానికి చితర్ల మహేష్ గౌడ్ ఆర్థిక చేయూత
కీసర, మేజర్ న్యూస్ (అక్టోబర్ 11):
కష్టాల్లో ఉన్న పేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించి చితర్ల మహేష్ గౌడ్ అండగా నిలిచారు. కీసర గ్రామానికి చెందిన శీలం రాములు ఇటీవల మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.5,000 ఆర్థిక సాయం అందించారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచి తన వంతు సహకారం అందించారు.కుటుంబ పెద్దను కోల్పోయి బాధలో ఉన్న కుటుంబానికి ఆర్థిక చేయూత అందించడం ద్వారా మహేష్ గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలవాలనే సందేశాన్ని ఈ సహాయం చాటిచెప్పింది.ఈ కార్యక్రమంలో కీసర మాజీ వార్డు సభ్యులు శీలం లలిత మల్లేష్, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు శీలం శ్రీనివాస్, బీఆర్ఎస్ కీసర మండల సోషల్ మీడియా అధ్యక్షుడు గోరంటి ప్రవీణ్, బీఆర్ఎస్ యువ నాయకులు కావలి రాకేష్, దానొల్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: కర్రె గణేష్, కీసర, మేడ్చల్ జిల్లా.