BREAKING
సీఈసీ దిష్టిబొమ్మ దహనం: ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన చెడుపై మంచి విజయం.. భక్తిశ్రద్ధలతో వత్సవాయి పోలీస్‌స్టేషన్‌లో దసరా వేడుకలు! పాఠశాల నిర్మాణానికి భూమి పూజ దసరా పండుగ సందర్భంగా మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాల పంపిణీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఆలూరు సాంబ శివారెడ్డిని కలిసిన వైసీపీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ మేయర్ ఎన్నికల్లో సహకారం కోరిన రమేష్ గౌడ్.. నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి దసరా సందర్భంగా తిమ్మారెడ్డిపల్లిలో జెండా ఆవిష్కరణ నేరుగా ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ 'రుద్రవనం పిఎస్'.. స్ట్రీమింగ్ డేట్ మరియు ట్రైలర్ మైండ్ బ్లాకింగ్! స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగాఎర్రగుంట్ల పోలీసుల హెచ్చరిక. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో దసరా పూజలు కొడుకు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల మరుసటి రోజే సీఎం ఫడ్నవీస్‌తో కలిసి వేదిక పంచుకున్న జాకీ ష్రాఫ్! దిల్లీ లవ్ కుష్ రామ్‌లీలాలో యామీ గౌతమ్ సందడి.. దసరా వేడుకల్లో రావణ వధ చేయనున్న నటి! రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం రామాయణం' వీఎఫ్ఎక్స్‌పై చిన్న చిన్న తప్పులు వెతకొద్దు.. విజ్ఞప్తి చేసిన రాకింగ్ స్టార్ యశ్!

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Select Suryaa Now
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టీజీ ఆర్టీసీ బస్సు


- బాటసింగారం వద్ద  ప్రమాదం.. 15 మందికి గాయాలు
- క్షతగాత్రులను వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలింపు


 అబ్దుల్లాపూర్ మెట్:    ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సంఘటన  అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
మండల పరిధి బాటసింగారం స్టేజ్‌ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న టీజీ ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రిపోర్టర్ : దుబ్బాక యాదయ్య
అబ్దుల్లాపూర్ మెట్, మేజర్ న్యూస్..