BREAKING
ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు... ప్రభుత్వ భూములు అమ్మొద్దు - ఎంపీ ఆర్. కృష్ణయ్య శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి వివోఏ లకు కనీస వేతనం ప్రకటించాలి ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం: ప్రొఫెసర్‌ హరగోపాల్‌ బెల్గాం ఎయిర్‌పోర్ట్ మూసివేత అలర్ట్: కమ్యూనిస్టుల ఐక్యతతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం.: సినీ నటుడు మాదాల రవి ఉక్రెయిన్‌లో రష్యా డ్రోన్ దాడి విషాదం: 10 మంది పౌరుల దుర్మరణం..మృత్యుంజయుడిగా బయటపడ్డ చిన్నారి అంబటి సాహిత్యం ఫై సదస్సు.... అయోవాలో సీసం నిల్వలను పేల్చివేయాలన్న యూఎస్ ఆర్మీ నిర్ణయంపై కలకలం... ఏఎంఆర్‌పై అవగాహనకు కిమ్స్‌ ఆధ్వర్యంలో రన్ ఫర్ ఏఎంఆర్

చర్మానికి మేలు చేసే సహజ చేనేత వస్త్రాలే లక్ష్యం.. ‘క్రాఫ్ట్ కౌచర్’

Select Suryaa Now
చర్మానికి మేలు చేసే సహజ చేనేత వస్త్రాలే లక్ష్యం.. ‘క్రాఫ్ట్ కౌచర్’

జూబ్లీహిల్స్, మేకర్ న్యూస్: ఫ్యాషన్‌తో పాటు చర్మానికి సౌకర్యవంతమైన వస్త్రధారణపై దృష్టి సారిస్తూ ‘క్రాఫ్ట్ కౌచర్’ బ్రాండ్‌ను ప్రారంభించారు. సహజ ఫైబర్స్, సంప్రదాయ భారతీయ చేనేతలతో రోజువారీ వినియోగానికి అనువైన దుస్తులను అందుబాటులోకి తీసుకొచ్చారు. హౌస్ ఆఫ్ గౌరీ ఆధ్వర్యంలో కోకాపేట్‌లోని పెర్ల్ కార్డినల్ వద్ద ఏర్పాటు చేసిన స్టోర్‌ను నటీ శ్రీలీల తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ స్వర్ణలత ప్రారంభించారు. సింథటిక్ ఫ్యాబ్రిక్స్‌కు ప్రత్యామ్నాయంగా సహజమైన వస్త్రాలను ప్రోత్సహిస్తూ.. చర్మానికి అనుకూలమైన, శరీరానికి సౌకర్యవంతమైన దుస్తులను రూపొందించడమే క్రాఫ్ట్ కౌచర్ లక్ష్యం. ఆఫీస్, ఇల్లు, బయటకు వెళ్లే సందర్భాలకు తగ్గట్టుగా చీరలు, డ్రెస్‌లు, కుర్తీలు, స్కర్ట్స్, డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులో ఉంచామని ఎండి ఉదయ్ సాయి తెలిపారు. రీసైకిల్డ్ ఫైబర్స్‌తో ప్రత్యేక కలెక్షన్‌ను సైతం రూపొందించామని చెప్పారు. బ్రైడల్, వెడ్డింగ్ కలెక్షన్స్‌తో గుర్తింపు పొందిన గౌరీ సిగ్నేచర్స్.. ఇప్పుడు రోజువారీ ఫ్యాషన్‌లోనూ భారతీయ చేనేతకు ప్రాధాన్యతనిస్తోంది. ఈ దుస్తుల ధరలు రూ.1,500 నుంచి రూ.20 వేల వరకు ఉండగా, ప్రత్యేక సందర్భాల చీరలు రూ.30 వేల వరకు లభిస్తున్నాయి. స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా నవంబర్ 22 నుంచి 24 వరకు 11 శాతం ప్రారంభోత్సవ రాయితీ ప్రకటించారు