ఐసీసీ చైర్మన్‌గా మరోసారి జై షా.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక
బాలి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చైర్మన్‌గా జై షా వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో డైరెక్టర్లందరూ ఆయన నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ రెండో పదవీకాలానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకం ఉంచి మరోసారి ఈ బాధ్యతలు అప్పగించిన బోర్డు సభ్యులకు జై షా కృతజ్ఞతలు తెలిపారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం, ప్రపంచవ్యాప్తంగా ఆటను మరింత విస్తరించడమే లక్ష్యంగా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2024లో గ్రెగ్ బార్క్లే స్థానంలో తొలిసారి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జై షా, ఇప్పుడు మరో దఫా ఈ అత్యున్నత పదవిలో కొనసాగనున్నారు.