BREAKING
పండుగ ముందే పసిడి బాంబ్.. ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు! ముచ్చింతల్‌లో వైభవంగా 'సుందర విజయం' సమాప్తి... దివ్యసాకేత క్షేత్రంలో ప్రత్యేక పూజలు బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, తమిళనాడు వైపు పయనం! శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక:

'90s' వెబ్ సిరీస్ మేజిక్ రిపీట్ చేసేందుకు ఆదిత్య హాసన్ సిద్ధం

Select Suryaa Now
'90s' వెబ్ సిరీస్ మేజిక్ రిపీట్ చేసేందుకు ఆదిత్య హాసన్ సిద్ధం

ఓటీటీ రంగాన్ని ఊపిన '90s: A Middle Class Biopic' వెబ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన యువ దర్శకుడు ఆదిత్య హాసన్, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెడుతున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ (Epic First Semester) తో ఆయన టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. సంచలన విజయం సాధించిన 'బేబీ' కాంబినేషన్‌ను రిపీట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా రంగ ప్రవేశం వెనుక ప్రయాణం
సొంతూరు వనపర్తిలో పదవ తరగతి వరకు చదువుకున్న ఆదిత్య హాసన్, ఆ తర్వాత హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసి మాస్టర్స్ కోసం యూకే వెళ్లారు. ఎవరి దగ్గరికూ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెళ్లకుండా, షార్ట్ ఫిలిమ్స్ అనుభవంతో నేరుగా దర్శకుడిగా మారాలనే లక్ష్యంతో అడుగులు వేశారు. యూకేలో తన సీనియర్ అయిన నవీన్ మేడారం ద్వారా సినీ పరిశ్రమతో పరిచయాలు పెంచుకున్నారు. కమల్ హాసన్ పై ఉన్న వీరాభిమానంతో తన పేరును ఆదిత్య హాసన్‌గా మార్చుకున్న ఈ టెహెంటెడ్ డైరెక్టర్, తన తండ్రి నిజ జీవిత స్ఫూర్తితో '90s' కథను రూపొందించారు. మొదట ఓటీటీ సంస్థ వెనకడుగు వేసినా, ఈటీవీ విన్ ద్వారా ఆ సిరీస్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

'ఎపిక్' వెనుక అసలు కథ ఇదే
'90s' సిరీస్‌కు కొనసాగింపుగా (సీక్వెల్) వస్తున్న సినిమానే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఇందులో సిరీస్‌లోని తమ్ముడి పాత్ర జీవితంలోని ఒక ముఖ్యమైన భాగాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు. భవిష్యత్తులో అన్న, అక్క జీవితాలను కూడా వేర్వేరు కథలుగా తీసే ఆలోచన ఉందని ఆదిత్య హాసన్ వెల్లడించారు. ఈ చిత్రానికి 'ఫస్ట్ సెమిస్టర్' అని టైటిల్ పెట్టడానికి కారణం, దీనికి కొనసాగింపుగా 'ఎపిక్ - ఫైనల్ సెమిస్టర్' కూడా రానుండటమే.

కాంబినేషన్ సెంటిమెంట్ అండ్ ప్రెషర్
'బేబీ' చిత్రంతో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీని ఈ సినిమా కోసం ఎంపిక చేయడం వెనుక నిర్మాత నాగవంశీ వ్యూహం ఉందట. హీరోను తాను ఎంపిక చేయగా, హీరోయిన్ పేరును నాగవంశీ సూచించారని, ఆ జోడీ వల్ల సినిమాపై హైప్ క్రియేట్ అవుతుందని ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయని ఆదిత్య హాసన్ తెలిపారు. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కుతున్న ఈ 'ఎపిక్' సినిమా ప్రేక్షకులకు ఎలాంటి కొత్త అనుభూతిని పంచుతుందో చూడాలి.