'కింగ్': షారూఖ్ ఖాన్ డాన్స్ డెడికేషన్
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, దీపికా పడుకోణ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్'. ఈ సినిమాలోని ‘తు మిల్ జాయే’ (Tu Mil Jaaye) అనే రొమాంటిక్ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీతో పాటు డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్లు పీయూష్ భగత్ , షాజియా సమజీ షారూఖ్ ఖాన్ అంకితభావం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. డాన్స్ మూమెంట్స్ పర్ఫెక్ట్‌గా వచ్చేంత వరకు షారూఖ్ విరామం లేకుండా ప్రాక్టీస్ చేశారని వారు తెలిపారు.
సౌత్ ఆఫ్రికాలోని కేప్‌టౌన్‌లో విపరీతమైన చలి, ఈదురు గాలులు ఉన్న క్లిష్టమైన వాతావరణంలో ఈ పాటను చిత్రీకరించారు. ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ షారూఖ్ ఖాన్ తన ఎనర్జీని తగ్గించకుండా ప్రతి స్టెప్‌ను ఎంతో పర్ఫెక్ట్‌గా పూర్తి చేశారని కొరియోగ్రాఫర్లు కొనియాడారు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ 'కింగ్' సినిమా 2026 క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. షారూఖ్ ఖాన్ మరోసారి తన డ్యాన్స్, నటనతో సరికొత్త మ్యాజిక్ చేశారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.