BREAKING
ఫ్రీహోల్డ్ భూముల సమస్యల పరిష్కార ప్రక్రియ, రీ–సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి -జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఘనంగా జ్యువెల్ హైట్స్‌లో శ్రీ విజయ వినాయక గణపతి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం ఇందిరాగాంధీకి ఘన నివాళి దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కె. సుధారాణి బాధ్యతల స్వీకరణ.. పుట్టినరోజు వేడుకల్లో చిన్నారులకు చేయూత పేద విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన చైర్‌పర్సన్ గడ్డం అనన్య రుద్రపూర్‌లో 32 మందికి చేయూత పెన్షన్ల పంపిణీ పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సబ్ కలెక్టర్.. మరికాసేపట్లో ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ కీలక భేటీ విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతపై అవగాహన నికోల్స్ సెంచరీ..తొలి టెస్టు తొలిరోజు న్యూజిలాండ్ 243/5 వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి ఇబ్బందులు పడవద్దు • ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వలస కార్మికులతో స్పెయిన్ ఆర్థిక జోరు ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం – ఎమ్మెల్యే

తమిళ చిత్ర పరిశ్రమలోకి రౌడీ హీరో తమ్ముడి గ్రాండ్ ఎంట్రీ.. జై జై గణేశాగా వస్తోన్న ఆనంద్ దేవరకొండ!

Select Suryaa Now
తమిళ చిత్ర పరిశ్రమలోకి రౌడీ హీరో తమ్ముడి గ్రాండ్ ఎంట్రీ.. జై జై గణేశాగా వస్తోన్న ఆనంద్ దేవరకొండ!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో తనదైన నటనతో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజాగా కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. తెలుగులో ఆయన హీరోగా నటించిన విభిన్న కథాచిత్రం గం గం గణేశా ఇప్పుడు తమిళంలోకి అనువాదమై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తమిళంలో జై జై గణేశా అనే ఆకర్షణీయమైన టైటిల్‌ను ఖరారు చేశారు. యాక్షన్, థ్రిల్లర్, కామెడీ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ తమిళ ప్రేక్షకులను పలకరించనున్నారు.

జేజే మూవీస్ పతాకంపై విజయ్ మాధవన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన నయన్ సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్లుగా నటించారు. రాజ్ అరుణ్ ఈ చిత్రంలో శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండగా, ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఉత్కంఠకు గురిచేసేలా ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే తమిళంలోనూ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

సినిమా కథాంశం విషయానికి వస్తే, ఇందులో హీరో గణేష్ ఎలాగైనా కోట్లకుాధిపతి కావాలని ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా అతనికి సుమారు ఏడు కోట్ల రూపాయల విలువైన వజ్రాన్ని దొంగిలించే భారీ అవకాశం దక్కుతుంది. తన ప్లాన్ ప్రకారం ఆ వజ్రాన్ని చోరీ చేసి ఒక గణపతి విగ్రహంలో భద్రపరుస్తాడు. మరోవైపు ప్రముఖ రాజకీయ నేత కిషోర్ సహకారంతో రుద్ర అనే నేరస్థుడు గణేశ విగ్రహాలలో దాచిన డబ్బును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ఈ విగ్రహాలు అనుకోకుండా తారుమారవడంతో అసలు కథ మొదలవుతుంది.

తన వజ్రం కోసం గణేష్, డబ్బు కోసం రుద్ర చేసే అన్వేషణ పూర్తిగా ఒక గ్రామంలో జరిగే గణేశ చతుర్తి పండుగ వేడుకల నేపథ్యంలో సాగుతుంది. ఈ నేపథ్యంలో చోటుచేసుకునే గందరగోళ పరిస్థితులు, ఊహించని మలుపులు, హాస్యభరిత సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చిత్ర బృందం పేర్కొంది. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ యాక్షన్ ప్యాక్ట్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు తమిళ తంబీలను కూడా ఏ విధంగా అలరిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.