యువతకు కలాం జీవితం స్ఫూర్తిదాయకం : ప్రభు చరణ్
వాల్మీకిపురం,మేజర్ న్యూస్ : మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ప్రభు చరణ్ మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించి, తన ప్రతిభతో శాస్త్రవేత్తగా ఎదిగి, దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతి పదవిని చేపట్టి ఆ పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు డాక్టర్ అబ్దుల్ కలాం అని కొనియాడారు. భారత అంతరిక్ష పరిశోధనలు, క్షిపణి సాంకేతికత, దేశ రక్షణ రంగాల అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.1997లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్న కలాం, 2002 నుంచి 2007 వరకు భారత 11వ రాష్ట్రపతిగా విశిష్ట సేవలందించారని తెలిపారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా దేశవిదేశాల్లోని 40కిపైగా విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయని వివరించారు.కలాం జీవితం,ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని,వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ : నానబాల కుమార్,మదనపల్లి రూరల్