BREAKING
ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా? అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. విజయవాడలో ఘనంగా ‘అమ్మ కనకదుర్గ’ ఆవిష్కరణ! పంచేడు వైసీపీ శ్రేణులు టీడీపీ బాట.. 50 మందికిపైగా నేతల చేరిక – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైభవంగా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు నామినేషన్ నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు గుంతమార్పల్లిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు మల్లేశ్వరం దసరా ఉత్సవాలలో ప్లాస్టిక్‌కు స్వస్తి.. స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో అన్నసమారాధన!

యువత వ్యాపార రంగంలోకి రావాలి

Select Suryaa Now
యువత వ్యాపార రంగంలోకి రావాలి

 

మెలియాపుట్టి. అక్టోబర్ 18. మేజర్ న్యూస్...

యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి స్వయం ఉపాధి సాధించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని పొందినప్పుడే వ్యాపారంలో మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. పాతపట్నంలోని బ్రాహ్మణ వీధిలో ఏర్పాటు చేసిన నేచురల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా యూనిట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, అక్కడ చేపడుతున్న కార్యకలాపాలు, ఉత్పత్తుల తయారీ విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ ఉత్పత్తులను తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు వ్యాపార రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
స్థానికంగా లభించే వనరులను ఉపయోగించుకొని ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్ రంగాల్లో యువత ముందుకు రావాలని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువచ్చి వినియోగదారుల ఆదరణ పొందేలా కృషి చేయాలన్నారు. వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించడంతోపాటు మరికొందరికి ఉపాధి కల్పించే దిశగా యువత ఆలోచించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.