BREAKING
ఫ్రెంచ్ నటుడు జెరార్డ్ డిపార్డియూపై అత్యాచార కేసు విచారణకు పారిస్ కోర్టు ఆమోదం బ్రిటిష్ పౌండ్ స్థిరత్వం.. అమెరికా డాలర్ ర్యాలీకి బ్రేక్ స్విట్జర్లాండ్‌లో ఐదు సైబర్ దాడులలో ఏఐ ఏజెంట్ల వినియోగం ఫిఫాపై సైబర్ దాడి ఇరాన్ యుద్ధం, ఇంధన ధరల షాక్.. ఆర్థిక సంక్షోభంలో విమానయాన సంస్థలు ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు" రాజ్యాంగ దినోత్సవ వేడుకలు " టెక్సాస్ జడ్జి నామినేషన్‌లో ట్రంప్ కీలక మార్పు పిరాట్లంక అభివృద్ధే కూటమి లక్ష్యం గ్రామ ప్రగతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కమతం సాంబశివరావు సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు పోలీస్ బడిలోని 42/2 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జి. బాలసుబ్రహ్మణ్యం, బి. శ్రీదేవి కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠిక పఠనం.. ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం

వంచించి మోసం చేసిన వ్యక్తుల వల్ల నామినేషన్ ఉపసంహరణ

Select Suryaa Now
వంచించి మోసం చేసిన వ్యక్తుల వల్ల నామినేషన్ ఉపసంహరణ

వేమూరు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలు లోని పదవ వార్డుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు నమ్మించి మోసం చేయడం వల్ల తాను అభ్యర్థిగా పోటీ చేసి నామినేషన్ దాఖలు చేసి ఉన్నాను. కానీ అనంతరం మనస్థాపాన్ని గురై తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు అభ్యర్థి జంపని రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని, నన్ను మోసం చేసిన గోలి శ్రీనివాసరావు  కుట్రల వల్లే నామినేషన్ ఉపసంహరణ చేసుకొనటం జరిగిందన్నారు.
భట్టిప్రోలు గ్రామ పంచాయతీ 10వ వార్డు అభ్యర్థిగా నాతో నామినేషన్ వేయించి ,నేను నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి, మాకు విజయావకాశాలు పూర్తిగా ఉన్నాయని భావించిన 10వ వార్డులో, బూత్ కమిటీ కన్వీనర్ మరియు మాజీ 10వ వార్డు మెంబర్ భర్తగా ఉన్న గోలి శ్రీనివాసరావు  తీవ్రమైన నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. నా వెన్నంటే ఉండి నన్ను గెలిపిస్తామని నమ్మబలుకుతూనే, పార్టీ సిద్ధాంతాలకు, రాజకీయ నైతికతకు తూట్లు పొడుస్తూ, ప్రత్యర్థి  నాయకులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని వారి ప్రలోభాలకు లొంగి గెలిచే అవకాశం పూర్తిగా ఉన్న 10వ వార్డులో నాపక్కనే ఉంటూ నా ఓటమి కోసం పనిచేస్తూ, నన్ను మరియు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని నిలువునా మోసం చేసి వెన్నుపోటు పొడిచారన్నారు. అంతేకాకుండా, సంఘ కట్టుబాట్లు మరియు సంఘ పెద్దల సూచనల మేర సంఘ పురోభివృద్ధి కొరకు సిద్ధాంతపరంగా నేను అభ్యర్థిత్వాన్ని వదులుకోవడం జరిగిందన్నారు. ఒక మహిళనని కూడా చూడకుండా నన్ను నిత్యం అనేక రకాల అవమానాలకు, మానసిక వేధింపులకు గురిచేస్తూ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారు. నా వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఇలాంటి కుట్రలు, అవమానాలు మరియు నమ్మకద్రోహుల మధ్య పోటీ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.
పార్టీకి, నాకు జరిగిన ఈ వెన్నుపోటుకు మరియు వేధింపులకు నిరసనగా, నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి భట్టిప్రోలు 10వ వార్డు మెంబర్ నామినేషన్‌ను నేను స్వచ్ఛందంగా ఉపసంహరించుకు న్నాను.
నాపై నమ్మకంతో నన్ను ఆశీర్వదించిన భట్టిప్రోలు గ్రామ ప్రజలకు,10వ వార్డు ఓటర్లకు, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నా శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గెలిచే స్థానాన్ని ప్రత్యర్థులకు తాకట్టు పెట్టిన గోలి శ్రీనివాసరావు నమ్మకద్రోహాన్ని 10వ వార్డు ఓటర్లు, గ్రామ ప్రజలు విజ్ఞతతో గమనించి, ప్రజాస్వామ్యబద్ధంగా తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నాను.