BREAKING
అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ చెరువులో శవమై తేలిన యువకుడు

వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కమిషనర్ సమావేశం

Select Suryaa Now
వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కమిషనర్ సమావేశం

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :  ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గం 117 పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నామని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వై.ఓ నందన్ తెలిపారు.  కార్పొరేషన్ కార్యాలయం కమిషనర్ ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఈ.ఆర్.ఓ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) రెండవ దశ నిర్వహణపై అవగాహన సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త ఓటర్లను గుర్తించడంలో, ఓటరు నమోదు చేయించడంలో, తప్పులు లేని సమగ్రమైన తుది ఓటరు జాబితాను రూపొందించడంలో స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.ఎల్.ఓ లకు సహకరించాలని ఈ.ఆర్.ఓ సూచించారు. 
ఈ సమావేశంలో నెల్లూరు నగర నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులు జనసేన - శ్రీకాంత్, టిడిపి - అజయ్ కుమార్, కాంగ్రెస్ - సంజయ్ కుమార్, బిజెపి - హర్షవర్ధన్, వైఎస్సార్ సిపి - అర్షిత్ రెడ్డి, ఏ.ఈ.ఆర్.ఓ డి.వి లక్ష్మీ, డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్, నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.