BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

విజయవాడలో నాఫ్ ఇండియా నైపుణ్య శిక్షణ అకాడమీ ప్రారంభం

Select Suryaa Now
విజయవాడలో నాఫ్ ఇండియా నైపుణ్య శిక్షణ అకాడమీ ప్రారంభం

విజయవాడ మేజర్ న్యూస్ : నిర్మాణ రంగంలో నైపుణ్యం కలిగిన యువతను తీర్చిదిద్ది, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో నాఫ్ ఇండియా సంస్థ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో విజయవాడలో నూతన శిక్షణ అకాడమీని ప్రారంభించింది. డ్రైవాల్, సీలింగ్ నిర్మాణ వ్యవస్థల అమరికలో ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై ఈ కేంద్రం దృష్టి సారించనుంది. 18 ఏళ్లు నిండిన అభ్యర్థులకు 45 రోజుల పాటు శిక్షణ అందించనుండగా, తొలి ఏడాదిలో సుమారు 100 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శిక్షణలో భాగంగా నిర్మాణ పనుల అమరిక పద్ధతులు, సాంకేతిక అంశాలు, పని ప్రదేశాల్లో భద్రతా నియమాలను బోధించనున్నారు. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా నిర్మాణం, రియల్ ఎస్టేట్, అంతర్గత అలంకరణ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతను సిద్ధం చేయనున్నారు. ఈ సందర్భంగా నాఫ్ ఇండియా ముఖ్య ఆర్థిక అధికారి శ్రే మెహందిరత్తా మాట్లాడుతూ ఆధునిక నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి ఎంతో కీలకమని, ఈ అకాడమీ ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కార్యక్రమాల డైరెక్టర్ రాజేష్ థోక్లే మాట్లాడుతూ పరిశ్రమ అవసరాలకు తగిన ఆచరణాత్మక శిక్షణతో యువత ఉద్యోగ సాధన సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో గోరఖ్‌పూర్‌లో చేపట్టిన శిక్షణ కార్యక్రమానికి కొనసాగింపుగా విజయవాడలో ఈ అకాడమీని ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.