BREAKING
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డి.ఎస్.పి నరసింహారావు ఏజెన్సీలో పోలీసుల విస్తృత కూంబింగ్ ఆపరేషన్లు ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం....

విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ తేదీ ఈ నెల 29కి మార్పు *కౌంటింగ్ యధావిధిగా 30వ తేదీనే* -- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

Select Suryaa Now
విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ తేదీ ఈ నెల 29కి మార్పు  *కౌంటింగ్ యధావిధిగా 30వ తేదీనే*  -- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

 

 

విజయనగరం, మేజర్ న్యూస్ , అక్టోబర్ 20:  

మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో విజయనగరం నగరపాలక సంస్థకు ఈ నెల 28వ తేదీన నిర్వహించాల్సిన పోలింగ్‌ను 29వ తేదీకి మార్పు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు.

ఈ నెల 27వ తేదీన విజయనగరంలో శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర  నేపథ్యంలో, ప్రజల సౌకర్యార్థం మరియు ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలింగ్ తేదీని మార్చాలని జిల్లా ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు విజ్ఞప్తి చేసిన విషయం విధితమే. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం విజయనగరం నగరపాలక సంస్థకు పోలింగ్ తేదీని ఈ నెల 29వ తేదీగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు.

కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30వ తేదీనే ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.

అదేవిధంగా, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలకు సంబంధించి పోలింగ్, కౌంటింగ్ తేదీల్లో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ వివరించారు.

విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ తేదీలో జరిగిన మార్పును ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు గమనించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోరారు. 

శ్రీనివాస్ విజయనగరం