విద్యావంతురాలైన స్నేహలతను గెలిపించండి
హొళగుంద , సూర్య ప్రతినిధి:
కర్నూలు జిల్లా హొళగుంద గ్రామ హొళగుంద మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 15వ వార్డు మెంబర్ అభ్యర్థిగా వరాల. మల్లయ్య సతీమణి విద్యావంతురాలైన వరాల. స్నేహలత నామినేషన్ దాఖలు చేశారు. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.15వ వార్డు పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల కొరత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వరాల కుటుంబ సభ్యులు తెలిపారు.
ముఖ్యంగా వార్డులోని తాగునీటి సమస్యకు పరిష్కారం చూపడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, వీధి దీపాల ఏర్పాటు, రహదారుల అభివృద్ధి వంటి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ, కాలనీవాసులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వార్డు అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ 15వ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేయడమే తమ కుటుంబ లక్ష్యమని వరాల. మల్లయ్య తెలిపారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా.