BREAKING
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎల్లంపేట వార్డు అధికారి!... రవీందర్ రెడ్డి 898 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్, 25,800 పైన నిఫ్టీ ముగింపు ఎమ్మెల్యే ఆమిలినేని ఇల్లు బృందావనంలో ఘనంగా సన్మానం. మిస్కిన్ వీడియో వివాదంపై కీర్తి సురేశ్ ఘాటు స్పందన.. తండ్రీకూతుళ్ల అనుబంధం అంటూ క్లారిటీ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి జనసేన పార్టీ ప్రచారం రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్ ఏ తడబాటు.. అభిషేక్, వైభవ్ నిరాశ పీఎం మోదీ వ్యాఖ్యలపై జైరాం రమేశ్ విమర్శలు.. మహిళల ఆరోగ్యం సమాజానికి సౌభాగ్యం! డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి వైయస్సార్ పార్టీలో చేరికలు ప్రియుడి పుట్టినరోజున కృతి సనన్ స్పెషల్ పోస్ట్.. క్యూటీ అంటూ షేర్ చేసిన ఫొటో వైరల్ 2027-28 బడ్జెట్‌పై ఉపాధి, కార్మిక రంగాలతో నిర్మలమ్మ కీలక భేటీ కూటమి సర్పంచ్అ భ్యర్థి గంగాధర్ ఎమ్మెల్యే అమిలినేనితో భేటీ. ద హంగర్ గేమ్స్: సన్‌రైజ్ ఆన్ ది రీపింగ్ రివ్యూ.. ఫ్రాంచైజీ స్థాయిని నిలబెట్టిన ప్రీక్వెల్ రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎల్లంపేట వార్డు అధికారి

పామూరు అభివృద్ధికి నా జీవితమే అంకితం

Select Suryaa Now
పామూరు అభివృద్ధికి నా జీవితమే అంకితం

 

పామూరు, మేజర్ న్యూస్ : 

పామూరు పట్టణం అభివృద్ధి చెందాలి ప్రజలకు అన్ని సౌకర్యాలు అందాలి ప్రతి వీధి పరిశుభ్రంగా, ప్రతి వార్డు ప్రగతికి చిరునామాగా మారాలి ఇదే  షంషూర్ మనసులోని బలమైన ఆకాంక్ష. పామూరుపై ఉన్న మమకారం పట్టణ అభివృద్ధిపై ఉన్న ప్రత్యేక ఆసక్తి ఆయనను సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిపాయి. పదవి అనేది హోదా కోసం కాదని ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తున్న షంషూర్ పామూరును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో ప్రజల ముందుకు వచ్చారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాల మెరుగుదల, వీధుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించాలన్నది ఆయన ఆలోచన. పట్టణంలోని ప్రతి ప్రాంతం సమానంగా అభివృద్ధి చెందాలని ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం లభించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా అవకాశం లభిస్తే అందరినీ కలుపుకుని పామూరు ప్రగతికి కృషి చేయాలన్నది ఆయన సంకల్పం. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన షంషూర్‌కు కూటమి నాయకులు, కార్యకర్తల మద్దతు ఉంది. రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకుని ప్రజల ఆశీస్సులు కోరుతున్న ఆయన తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పామూరు అభివృద్ధి తన వ్యక్తిగత ఆశయంగా భావిస్తూ ప్రజాసేవకు అంకితమవ్వాలన్న ఆకాంక్షతో షంషూర్ ఎన్నికల పోరులో ముందుకు సాగుతున్నారు.