విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
రాజమహేంద్రవరం
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో పాల్గొనాలి - ఆకుల వీర్రాజు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలు స్థానిక టౌన్ హాల్ ఎదురుగా గల రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీలో జరిగాయి.
ఈ పోటీల బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిస్టిక్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ శ్రీ ఆకుల వీర్రాజు గారు మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువుతోపాటు క్రీడలలో పాల్గొనాలని, అందువల్ల శారీరకంగా,మానసికంగా దృఢంగా ఉంటారని, జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు అందరూ వచ్చే నెల భీమవరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో కూడా గెలుపొంది జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అంటూ క్రీడాకారులు అందర్నీ కి శుభాకాంక్షలు తెలియజేశారు చక్కగా నిర్వహించిన వ్యాయామ ఉపాధ్యాయ సంఘానికి అభినందనలు తెలియజేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జరిగిన ఈ పోటీలలో రాజమహేంద్రవరం కాకినాడ పుల్లేటికుర్రు కత్తిపూడి పి గన్నవరం సీతానగరం మరియు అనేక మండలాల నుంచి సుమారు 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారని, అండర్ 14 బాలబాలికలు అండర్ 17 బాలబాలికలు విభాగాలలో ప్రతి గ్రూప్ నుంచి అయిదుగురుకు క్రీడాకారులను ఎంపిక చేస్తామని వీరందరూ వచ్చే నెల భీమవరంలో జరిగే స్టేట్ లెవెల్ ఎస్ జి ఎఫ్ ఐ టేబుల్ టెన్నిస్ పోటీలలో తూర్పుగోదావరి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని SGFI సెక్రెటరీ వి శ్రీనివాస్ తెలియజేశారు
ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు జెవివి అప్పారెడ్డి, కార్యదర్శి వి టి వి సుబ్బారావు, కోశాధికారి కె సత్యనారాయణ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం గౌరవ అధ్యక్షులు రాజశేఖర్, అధ్యక్షులు నాగరాజు,సెక్రెటరీ వీరబాబు అతిథులుగా పాల్గొనగా పి ఈ టి బాపిరాజు, అన్నపూర్ణ, గంగాధర్,పరిమళకుమారి సురేష్, శ్రీనివాసరెడ్డి, నాగేశ్వరరావు, డేవిడ్ తదితరులు పోటీలు దిగ్విజంగా జరగడానికి సహకరించారు.