విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి.. రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్
ఎమ్మిగనూరు: సూర్య ప్రతినిధి
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, ప్రయోగాత్మక ఆలోచనలను ప్రోత్సహించాలని రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి అన్నారు. శనివారం ఎమ్మిగనూరులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ‘సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ చాలెంజ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సావిత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అక్టోబర్ 24లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పోటీలో భాగంగా మొత్తం రూ.5.4 కోట్ల వరకు బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వాల్మీకి దయాసాగర్, లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు వడ్డే ఊరుకుందు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బంగి రాజేష్, ప్రధాన కార్యదర్శి ఉప్పర రామ్‌చరణ్, నాయకులు వడ్డే బజారి, రవికిరణ్, పద్మశాలి మల్లికార్జున, వెంకట్ రాజు, వడ్డే మహేష్, పెద్దయ్య, గణేష్, మహేష్, నరసప్ప, గడ్డం రవి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు