BREAKING
చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి.. ప్రజాసేవలో ముందుండాలి సోనీ నుంచి సరికొత్త ఎఫ్‌ఎక్స్5 సినిమా కెమెరా ఇంద్రకీలాద్రిపై పవిత్ర వృక్షాల పెంపునకు శ్రీకారం నేటి పంచాంగం 10 నవంబర్, 2026 అమ్మవారి అన్నదానానికి రూ.2.50 లక్షల విరాళం నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని

విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

Select Suryaa Now
విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

విజయవాడ మేజర్ న్యూస్ : విద్యార్థినులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. ఆదివారం జి.కొండూరు మండలం కుంటముక్కలలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ‘విద్యార్థినీ... జర భద్రం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. నేరాలు జరగకుండా ముందస్తు అవగాహన కల్పించడం అందరి బాధ్యతన్నారు. ఏసీపీ పి. రామచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థినులపై అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైలవరం సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ విద్యార్థినులు తమ సమస్యలను తల్లిదండ్రులతో నిర్భయంగా పంచుకోవాలని సూచించారు. న్యాయవాది డి. సౌజన్య మహిళలపై జరిగే అకృత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరగా, సామాజికవేత్త గోళ్ల నారాయణరావు ‘జర భద్రం’ కార్యక్రమం భద్రతపై అవగాహన కల్పించేందుకేనని వివరించారు. కార్యక్రమంలో ఉయ్యూరు నరసింహారావు, అంగడి మురళీకృష్ణ, ప్రిన్సిపాల్ కె. బ్యూల, ఎస్సై సతీష్, మహిళా ఎస్సై గిరిజామణి తదితరులు పాల్గొన్నారు.           

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.