BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

విద్య ప్రైవేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం..

Select Suryaa Now
విద్య ప్రైవేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం..

సీతమ్మధార, అక్టోబర్ 5, మేజర్ న్యూస్ : విద్య ప్రైవేటీకరణను, కాషాయికరణను వ్యతిరేకిస్తూ పిడిఎస్ఓ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా మహాసభను నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ కుమార్ ఆహ్వానం పలకగా, జిల్లా సహాయ కార్యదర్శి జానకి అధ్యక్షత వహించారు. మహాసభకు ప్రధాన వక్తగా విచ్చేసిన ఆంధ్ర యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుబ్బయ్య  మాట్లాడుతూ విద్య అనేది విద్యార్థులకు ఈ ప్రపంచం గూర్చి సామాజిక అవగాహనను అందించేదిగా, ఈ సమాజ అభివృద్దికి ఉపయోగపడేదిగాను ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా మన ప్రభుత్వాలు భావజాలానికి అనుగుణమైన, అప్రజాస్వామికమైన, ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధానాలను విద్యారంగంలోకి తీసుకువస్తున్నారు. నీతి అయోగ్ లెక్కల ప్రకారం దేశంలో 94 వేల పాఠశాలను మూసివేశారు. అదే సమయంలో విరివిగా మద్యం షాపులకు అనుమతులు ఇస్తున్నారు. డిస్టెన్స్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ పేరుతో ఉపాధ్యాయ రహిత విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇవి సర్టిఫికెట్లను ఇవ్వగలుగుతున్నాయి గాని, నాలెడ్జ్ ని ఇవ్వలేకపోతున్నాయి. అలాగే విద్యార్థులు ఎప్పుడైనా చదువు మానేసే విధంగా పాలసీలను తీసుకువస్తున్నారు. మతతత్వాన్ని పెంచిపోషించే సిలబస్ లను చేర్చి విద్యా కాషాయకరణకు దారులు వేస్తున్నారని, ప్రశ్నించే హక్కును హరిస్తూ, నిర్బంధాలకు గురిచేస్తున్నారని, ప్రభుత్వాలు తీసుకొస్తున్న విధానాలను అర్థం చేసుకుంటూ భవిష్యత్తు కోసం పోరాడకపోతే దోపిడీకి గురవుతున్న మనలాంటి వారికి భవిష్యత్తు లేదన్నారు.
అనంతరం విశాఖ జిల్లా అధ్యక్షుడు పి. విశ్వనాథ్ మాట్లాడుతూ 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగానే మన రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా విద్యకు కేటాయించాల్సిన బడ్జెట్ను కేటాయించకపోవడంతో పాటు, కేటాయించిన మొత్తాన్ని కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదు. వేలకోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలు అలాగే ఉండిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా సర్దుబాటు చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా యూనివర్సిటీలో అధ్యాపక పోస్టులను భర్తీ చేయలేదు. క్రమంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉండే విద్యార్థుల సంఖ్య కంటే ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ పోతుందని అన్నారు. 
జిల్లా కార్యదర్శి వి. లక్ష్మీ కార్యదర్శి నివేదికను ప్రవేశ పెడుతూ “గత సంవత్సర కాలంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనేక రకాల సమస్యల మీద పోరాడడంతోపాటు కొన్ని ఫలితాలను పొందగలిగామని, పార్వతిపురం ప్రాంతంలో పచ్చకామెర్లతో మరణించిన విద్యార్థుల మరణానికి కారణం శుభ్రత లేని నీటిని తాగడమేనని గుర్తించి, విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్‌లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందించిన రెండు నెలలలో ప్రతి హాస్టల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారని, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రెండు నెలలైనా నోట్ బుక్స్ రాలేదని తెలుసుకొని సంబంధిత అధికారులని కలిసి విన్నవించిన మరుసటి రోజుకి పుస్తకాలను తెప్పించుకోగలిగామని, యూనివర్సిటీలోని హాస్టల్స్ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నామని అన్నారు.
అనంతరం అధ్యక్ష కార్యదర్శులుగా పి.విశ్వనాధ్, వి.లక్ష్మి, ఉపాధ్యక్షులుగా సతీష్, ఈశ్వర్, చంద్రకళ, నాగరాజులు, సహాయ కార్యదర్శులుగా జానకి, కుమార్, తరుణ్‌లను, కోశాధికారిగా రఘులతో పాటు 17 మంది కమిటీ సభ్యులతో నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది.