BREAKING
*శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ పెద్దపల్లి ఎస్సైగా గుమ్ముల రాజశేఖర్‌ మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు ను పరామర్శించిన ఎమ్మెల్సీ ఒకే రోజు 355 మందికి 1 కోటి 55 లక్షలుసీఎంఆర్ఎఫ్ సాయం. వైద్యానికి ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి నిమ్మల విజ్ ఎయిర్ దూకుడు ప్రతి వార్డులో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం .. ఎర్రకోట రాజీవ్ రెడ్డి

విద్య ద్వారానే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

Select Suryaa Now
విద్య ద్వారానే విద్యార్థులకు  ఉజ్వల  భవిష్యత్తు

జలదంకి, మేజర్ న్యూస్ :  విద్య ద్వారానే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని,  కావలి మాజీ ఎమ్మెల్యే, ఉదయగిరి, కావలి నియోజకవర్గాల టిడిపి సీనియర్ నేత వంటేరు వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బ్రాహ్మణక్రాక ఉన్నత పాఠశాల ఆవరణలో వంటేరు వేణుగోపాల్ రెడ్డి తన సొంత నిధులతో జలదంకి మండలంలోని ఐదు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు దాదాపు 1400 ఉచిత సైకిల్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే మహిళల సాధికారితకు, వారి ఆర్థిక అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు ఉచిత కుట్టుమిషన్ల శిక్షణా కేంద్రాన్ని బ్రాహ్మణక్రాక లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు వంటేరు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పి4 పథకం  స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తన లక్ష్యం అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం తన వంతు బాధ్యతగా సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. దూరాభారాల వల్ల చదువులకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని, దీనివల్ల వారి ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా సమయం ఆదా అవుతుందన్నారు. మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడినప్పుడే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయి అన్నారు. మహిళలకు ఆధునిక సాంకేతికతతో కూడిన ఆటోమేటిక్ కుట్టు మిషన్లపై పూర్తిస్థాయి ఉచిత శిక్షణ అందించేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. శిక్షణ కాలంలో అనుభవజ్ఞులైన మాస్టర్ల ద్వారా ఉచితంగా టైలరింగ్ నైపుణ్యాలను  నేర్పించి, శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న మహిళలు ఇంటి వద్ద నుండే స్వయం ఉపాధి పొందేలా తదుపరి సహకారం కూడా అందించనున్నట్లు తెలిపారు. . అనంతరం పాఠశాల హెచ్ఎం జయలలిత, ఎంఈఓ నాగేశ్వరరావు, అన్నదాత ప్రాసమణి తదితరులను వంటేరు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు మునగాల తిరుమలరెడ్డి, టిడిపి సీనియర్ నేతలు వంటేరు జయచంద్రారెడ్డి,పులుగుంట మధు రెడ్డి, చెవూరు జనార్దన్ రెడ్డి, పూనూరు భాస్కర్ రెడ్డి, చిత్తా బత్తిన మస్తాన్ రెడ్డి, గోచిపాతల వెంకట రమణయ్య,పున్నం రోసిరెడ్డి, కంచర్ల వినోద్ నాయుడు, టిడిపి మండల అధ్యక్షురాలు వడ్డే అనురాధ సొసైటీ చైర్మన్ అప్పలనాయుడు, డైరెక్టర్  మధుసూదన్ రెడ్డి, మందపల్లి మాల్యాద్రి యాదవ్,బిజెపి జిల్లా కార్యదర్శి మారెళ్ళ బ్రహ్మారెడ్డి, టిడిపి యూత్ నాయకులు వంటేరు నందగోపాల్ రెడ్డి, మేకల శ్రీనాథ్ రెడ్డి, జిలుమూడి వినయ్ కుమార్ రెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, వేలమూరి పాండురంగారెడ్డి, మాదిరెడ్డి సుబ్బారెడ్డి,సింగమనేని మనోజ్ కుమార్ యాదవ్, ఉప్పుటూరి సుదీర్, స్వర్ణ కొండప నాయుడు,బుట్టి దర్గా బాబు, అధికారులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా కమిటీ చైర్మన్, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.