BREAKING
మూలపాడు వేదికగా ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం.. కఠోర సాధనలో ఇరు జట్లు ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్

విడిపోతే పడిపోతాం-కలిసి నడిస్తే నిలబడతాం! కార్యకర్తలకు దొన్నుదొర దిశానిర్దేశం

Select Suryaa Now
విడిపోతే పడిపోతాం-కలిసి నడిస్తే నిలబడతాం!  కార్యకర్తలకు దొన్నుదొర దిశానిర్దేశం

అరకులోయ, అక్టోబర్ 9, మేజర్ న్యూస్:  విడిపోతే పడిపోతామని కలిసి ఉంటేనే నిలబడతామన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకోవాలని పార్టీ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలకు ఆ పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి,ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం ప్రాంతీయ జోన్ చైర్మన్ డాక్టర్ సియ్యారి.దొన్నుదొర పేర్కొన్నారు.అరకులోయ లోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జి సి సి చైర్మన్,మాజీమంత్రి కిడారి.శ్రావణ్ కుమార్ తో కలిసి శుక్రవారం పార్టీ క్యాడర్ తో సమావేశమయ్యారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దొన్నుదొర మాట్లాడుతూ అంత ఐక్యంగా ఉంటే విజయం అత్యంత సులువుగా ఉంటుందని, అవతలి వాళ్ళ మాటలు విని విడిపోతే మనం పడిపోతామని ఆయన అన్నారు.అంతా కలిసి నడిస్తేనే నిలబడతామన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంత మంది పేర్లు అధిష్టానానికి పంపించేంత వరకే తమ ప్రమేయం ఉంటుందని అభ్యర్థులు ఎంపిక మాత్రం అధిష్టానం చూసుకుంటుందని ఎవరకి టికెట్ వచ్చినా మనకే టికెట్ వచ్చిందన్న భావనతో పనిచేసి ఆ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మనం ఏం చేస్తున్నామో లోకేష్ గారికి తెలుస్తుందని అందువలన క్రమశిక్షణతో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.మనం చేస్తున్నది ఎవరికీ తెలియదు అని అపోలో ఎవరు ఉండదని పార్టీ నేరుగా మనల్ని వాచ్ చేస్తుందని విషయాన్ని గమనించాలన్నారు. అవకాశం వచ్చిన వాళ్ళ ఆహ్వానిద్దామని,రాని వారికి భవిష్యత్తులో కచ్చితంగా అవకాశం వస్తుందని ఆశాభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.మీకు టికెట్ ఇవ్వకపోయినా కమిటెడ్ గా పార్టీ కోసం పనిచేస్తున్నందుకు ఖచ్చితంగా అవకాశం వెతుక్కుంటూ మీకు వస్తుందన్నారు.ప్రతి పంచాయతీలోనూ ప్రతి జడ్పిటిసి,ఎంపిటిసి స్థానాలను మనమే గెలిచి తీరాలని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని విస్మరించకూడదన్నారు. అధిష్టానం ఆదేశాలను పాటించాల్సిందేనని హుకుం జారీ చేశారు.