విధి నిర్వహణలో ఉండగానే తుపాకీతో కాల్చుకుని జవాన్ మృతి
మెలియాపుట్టి, సూర్య : దేశ రక్షణ కోసం సైన్యంలో విధులు నిర్వహిస్తున్న చాపర గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నక్క నారాయణరావు (40) ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతుడికి భార్య హైమావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామమైన చాపరకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై కన్నీటి నివాళులర్పించారు.