BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

విదేశీయుల వివరాలు 24 గంటల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

Select Suryaa Now
విదేశీయుల వివరాలు 24 గంటల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

నెల్లూరు, అర్బన్, క్రైమ్  మేజర్ న్యూస్  :  జిల్లాలోని హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, హాస్టళ్లు, ఆశ్రమాలు, సత్రాలు, హాస్పిటళ్లు, మతపరమైన ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అలాగే విదేశీయులకు వసతి కల్పించే ఇతర సంస్థల నిర్వాహకులు తమ వద్ద బస చేసే ప్రతి విదేశీయుడి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల సూచించారు. విదేశీయుల రాక, బస, వారి వివరాలను నిర్దేశిత నిబంధనల ప్రకారం నమోదు చేయడంతోపాటు, ఆ వివరాలను ఫామ్-III ద్వారా 24 గంటల్లో ఆన్‌లైన్‌లో సమర్పించాలని స్పష్టం చేశారు.ఈ నిబంధనలు భారత సంతతికి చెందిన విదేశీయులు (ఓ సి ఐ –ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా)కార్డు కలిగినవారికి, భూటాన్‌, నేపాల్‌ దేశాల పౌరులకు కూడా వర్తిస్తాయని తెలిపారు. ఇతర దేశాల నుంచి నెల్లూరు జిల్లాకు వచ్చే విదేశీయుల వివరాలను సంబంధిత సంస్థలు తప్పనిసరిగా నమోదు చేయాలని పేర్కొన్నారు.ది ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ యాక్ట్‌–2025లోని సెక్షన్‌ 8 ప్రకారం, విదేశీయుల వివరాలను ఫామ్-IIIలో నమోదు చేసి, https://indianfrro.gov.in/formIII పోర్టల్‌ ద్వారా 24 గంటల్లో సంబంధిత ఎఫ్ ఆర్ ఆర్ ఓ/ఎఫ్ ఆర్ ఓ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించని సంస్థల నిర్వాహకులపై సెక్షన్‌ 23(బి) ప్రకారం రూ.50 వేల నుంచి జరిమానా విధించడంతోపాటు, జైలు శిక్ష, క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు కూడా అవకాశం ఉంటుందని హెచ్చరించారు.జిల్లాకు వచ్చే విదేశీయుల నుంచి చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలను పరిశీలించాలని, వారి వీసా, పాస్‌పోర్టు వివరాలను నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలీసు, విదేశీయుల నమోదు విభాగాలకు సహకరించాలని సంబంధిత సంస్థల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.