విబి-జి రామ్ జి ఉద్యోగుల సమస్యలను అక్టోబర్ 10, 2026లోగా పరిష్కరించాలి
అనకాపల్లి ప్రతినిధి, అక్టోబర్ 3, మేజర్ న్యూస్ .
ఆంధ్రప్రదేశ్‌లోని విబి-జి రామ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం 2026అక్టోబర్ అక్టోబర్ 10వ తేదీ లోపుగా పరిష్కరించాలని రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కోరింది.
గత ఏడు సంవత్సరాలుగా జీతభత్యాల్లో పెంపు లేకపోవడంతో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జేఏసీ తెలిపింది. ఈసీ, జేఈ,టిఏ, సీవో, అండ్ఏ ఏఏ, ఏ పిడి, ఏపీఓ తదితర కేడర్ల ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లపై ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ తుది పరిష్కారం లభించలేదని పేర్కొంది.సమస్యల పరిష్కారానికి సంబంధిత కమిటీలను ఏర్పాటు చేసి చర్చలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో, అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ద్వారా కమిషనర్, పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖకు వినతిపత్రం సమర్పించనున్నట్లు జేఏసీ వెల్లడించింది.నిర్దేశిత గడువులోగా సమస్యలు పరిష్కారం కానిపక్షంలో అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశమై తదుపరి ప్రజాస్వామ్యబద్ధ కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీస్పష్టం చేసింది.
ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఎస్. అప్పలరాజు, కన్వీనర్ డి. కొండాజీ, ట్రెజరర్ ఓ. శివకాంతమ్మ, వైస్ చైర్మన్లు కె. ఉమాశంకర్, ఏపీ డి శ్రీనివాస్ కె. సూర్యకళ, రవిచంద్ర, డి బి టి నాగేశ్వరావు, సురేష్,కెల్విన్, గౌరవ అధ్యక్షులు డి వి ఎరకయ్య,సూర్యమణి,చిన్నారావు, కాశి ,రవిచంద్ర,శ్రీను,త్రినాథ్, బాలసుబ్రమణ్యం,కామేష్, పరమేసు,జగదీష్ మురళి,చంద్రకళ,ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
అనకాపల్లి ప్రతినిధి ,మేజర్ న్యూస్