BREAKING
పుణెలో గూగుల్ ఇంజనీర్ నెలవారీ ఖర్చు రూ.40,000 లోపే.. ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న పొదుపు మంత్రం! ఉత్తమ పౌరులుగా ఎదగాలి -నూతన విద్యార్థినులకు ఘనంగా ఇండక్షన్ -రెండు రోజుల జీవన నైపుణ్యాల శిక్షణకు శ్రీకారం -ఆత్మవిశ్వాసం, నాయకత్వం, వ్యక్తిత్వ వికాసమే లక్ష్యం: వీసీ ప్రొఫెసర్ వి.ఉమ 28న పాఠశాల స్థాయి కథల పోటీలు -డిసెంబర్ 6న విశ్వం టాలెంట్ స్కూల్ వేదికగా జిల్లా స్థాయి పోటీలు కథల పోటీలు బ్రోచర్ ఆవిష్కరించిన ప్రముఖులు 500 మిలియన్ డాలర్ల మైక్రోసాఫ్ట్ డీల్‌తో ఓపెన్‌ఏఐ నిషేధాన్ని అధిగమిస్తున్న బైట్‌డ్యాన్స్.. అమెరికా ఆంక్షలకు చెక్ పెడుతున్న చైనా టెక్ దిగ్గజం! ప్రమాణానికి ముందే ప్రజాసేవకు శ్రీకారం 54 డివిజన్ లో వీధి దీపాలు డ్రైనేజీ సమస్యల పరిష్కారం -ప్రజలలో వెలుగులు నింపిన నూతన కార్పొరేటర్ బోయళ్ళ శాంతి అత్యంత కష్టతరమైన ఏడాది తర్వాత స్పైస్‌జెట్‌కు రూ.5,500 కోట్ల సంజీవని.. నిధుల సమీకరణకు బోర్డు గ్రీన్ సిగ్నల్! ఆసియా టాప్ రిటైల్ వీధుల జాబితాలో మెరిసిన హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలు.. కానీ ఢిల్లీ ఖాన్ మార్కెట్ మాత్రం మరో స్థాయిలో! విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా సజ్జల మల్లికార్జున ఖరారు.*  గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ గా ఒక్క అవకాశం ఇవ్వండి... ఆదర్శ పంచాయతీ గా తీర్చిదిద్దుతాం.. టిడిపి సర్పంచ్ అభ్యర్థి వైయస్ రవి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయినా.. ఇంకా సంతకాలు ఎందుకు జరగడం లేదు? కారణం వివరించిన కేంద్ర వాణిజ్య కార్యదర్శి! సురక్షిత్ జిల్లాగా గుర్తింపు సాధించిన వరంగల్ జిల్లా జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన మాలోత్ చిన్ని వైఎస్ఆర్సిపి లోకి చేరికలు స్కాచ్ దిగుమతిదారులకు 162.5% పన్ను గూగ్లీ..

విభేదాలు వీడారు...వికాసం వైపు అడుగులు వేశారు!

Select Suryaa Now
విభేదాలు వీడారు...వికాసం వైపు అడుగులు వేశారు!
  • రాజకీయాలకు అతీతంగా..ఉల్లిభద్ర అభివృద్ధికి అడుగులు!
  • గ్రామ అభివృద్ధి కోసం ఏకమైన ఇరువర్గాలు
  • పెద్దల సమక్షంలో ఒకరికొకరు కరచాలనం చేసుకుని ఐక్యత చాటుకున్న నేతలు
  • ఎంపీపీ అభ్యర్థి నారాయణస్వామి, తవిటినాయుడు,ధనుoజయరావు
  • గ్రామ ఐక్యత కోసం చేతులు కలిపిన టీడీపీ,వైఎస్ఆర్ సీపీ నేతలు
  • రాజకీయాలకు అతీతంగా..."ఉల్లిభద్ర" అభివృద్ధికి అడుగులు!

గరుగుబిల్లి, సూర్య: రాజకీయ విభేదాల కంటే గ్రామ అభివృద్ధే మిన్న అని చాటి చెప్పారు గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామ తెలుగుదేశం,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.ఎప్పుడూ రాజకీయ పోటీతో ఉండే తెలుగుదేశం పార్టీ  మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రగతి మరియు శాంతిభద్రతల కోసం ఒకే వేదికపైకి వచ్చి ఆదర్శంగా నిలిచారు.గ్రామంలో ఎప్పటినుంచో ఉన్న చిన్న పాటి రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, ఊరి బాగుకోసం కలిసి పని చేయాలని ఇరు పార్టీల ముఖ్య నాయకులు నిర్ణయించుకున్నారు.గ్రామ పెద్దల సమక్షంలో రామ మందిరం వద్ద జరిగిన ప్రత్యేక సమావేశంలో టీడీపీ, వైఎస్సార్‌ సీపీ వర్గాలు ఏకమయ్యాయి.ఇకపై గ్రామంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా,పరస్పర సహకారంతో ముందుకు సాగాలని తీర్మానించారు. మౌలిక వసతుల కల్పన, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను, నిధులను గ్రామానికి తీసుకువచ్చి రోడ్లు,తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను మెరుగుపరచాలని ఇరు వర్గాలు సంకల్పించాయి.ఎన్నికల సమ యంలోనే రాజకీయాలు ఉండాలని, మిగిలిన సమయాల్లో గ్రామస్థులంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉండా లని నేతలు పిలుపునిచ్చారు.పార్టీ జెండాలను పక్కన పెట్టి 'గ్రామ అభివృద్ధి' అనే ఒకే జెండా కిందకు వచ్చిన ఇరువర్గాల నేతల నిర్ణయంపై ఉల్లిభద్ర గ్రామస్థులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దలు సమక్షంలో జరిగిన ప్రత్యేక సమావేశం లో ఇరువర్గాల నాయకులు, కార్యకర్త లు పాత కక్షలను మరచిపోయి ఒకరి కొకరు అభినందనలు తెలుపుకున్నా రు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ చేరవేయడానికి ఈఐక్యత ఎంతో దోహదపడుతుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్గ విభేదాల వల్ల ఇన్నాళ్లూ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిందని,ఇకపై అందరం కలిసి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఇరువర్గాల నేతలు ఈసందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.గ్రామ పెద్దలు మాట్లాడు తూ..యువత, నాయకులు తీసుకున్న ఈనిర్ణయం చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆదర్శమని కొనియాడారు.ఈకార్యక్ర మంలో నేతలు,గ్రామ పెద్దలు మరడాన తవిటినాయుడు,మరడాన నారాయణ స్వామి,శెట్టి గౌరునాయుడు,శెట్టి శ్రీని వాసరావు,బూరి రమేష్ నాయుడు,శెట్టి ధనుంజయరావు,నక్కెర్ల చిన్నారావు, మరడాన వెంకటనాయుడు,పొడుగు ధర్మరాజు,గుజ్జల ఈశ్వరరావు, యండ్రాపు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.