BREAKING
విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించిన గ్రంథాలయ అధికారి: 2028 జూన్ నాటికి.... శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి చేయడం నా జీవిత లక్ష్యం... #.నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.74 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు. #. గుడిశెలు లేని తెలంగాణే లక్ష్యం----- రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా బ్యూరో, ఎల్.కోటలో వైభవంగా దేవీ నవరాత్రులు, శ్రీ వెంకటేశ్వర దివ్యోత్సవాలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కోళ్ల దంపతులు గంగుబూడిలో నిరుపయోగంగా రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలు! కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అత్యంత వైభవోపేతంగా దేవి నవరాత్రులు దేశంలో ఓట్ల తొలగింపు అనేది అప్రజాస్వామికం-తెలంగాణ అమరేందర్ రెడ్డి మంచి మనసుంటే చాలు... అధికారమే ఉండాల్సిన అవసరం లేదు ఆదిలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం శరన్నవరాత్రి ప్రారంభ పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను విజయ వంతం చేయండి. ముప్పవరం సాయిబాబా గుడిలో ఘనంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు. కడ్తాల్ మండలానికి పదేళ్లు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం కుంగ్ ఫూ విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు. ఇంకొల్లులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం. పోలంపల్లి డ్యాం గండ్లు పూడ్చాలి.. రైతులకు సాగునీరు అందించాలి కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ సీపీ నేత తన్నీరు నాగేశ్వరరావు విమర్శలు

వెన్నెలపాలెంలో కన్నులపండుగ గా శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన

Select Suryaa Now
వెన్నెలపాలెంలో కన్నులపండుగ గా శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన

పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామంలోని స్థానిక రామాలయం ప్రాంగణంలో శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజున నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
​ఈ దివ్య మహోత్సవానికి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయన సతీమణి మాధవి లత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండప ప్రాంగణంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి బండారు దంపతులు ప్రత్యేక కుంకుమ పూజలు,అర్చనలు నిర్వహించారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ మహిమాన్విత శక్తి స్వరూపిణి అయిన శ్రీ దుర్గామాత దివ్య ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.సకల శుభాలు సిద్ధించి,గ్రామం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
​ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహాన్ని బండారు అయ్యప్పల నాయుడు విరాళంగా అందజేశారు.విగ్రహ ప్రతిష్ఠాపన రోజున జరిగిన వైదిక పూజా కార్యక్రమాల ఖర్చులతో పాటు, ఉత్సవంలో పాల్గొన్న సుమారు 300 మంది భక్తులకు అయ్యప్పల నాయుడు సొంత ఆర్థిక సహాయంతో మహా అన్నసమారాధన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
​ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వెన్నెల ఏకుల అప్పారావు,మాజీ ఎంపీటీసీ పైల రథాల సన్యాసిరావు,పైల జూనియర్ అప్పలనాయుడు,లోకిరెడ్డి సన్యాసినాయుడు (అభి),వెన్నెల గిరి, పైల ప్రసాద్,బోజంకి నాయుడు,గొంప మారునాయుడు,వాసిరెడ్డి ఈశ్వర్రావు, బండారు వీరునాయుడు, బండారు గణేష్,గోపి కనకరాజు తదితర టీడీపీ నాయకులు, భవానీ మాలధారులు, మహిళలు మరియు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రవికుమార్ 

ఎన్డీపీ సూర్య ప్రతినిధి