వెంపరాల అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసోత్సవాలు.
సూర్య అద్దంకి.
పోషణ మాసోత్సవాల వేడుకలను వెంపరాల అంగన్వాడీ కేంద్రం వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రమీల పాల్గొని పౌష్టికాహారం పై అవగాహన కల్పించారు. అన్ని విటమిన్లు, మినరల్స్ సమపాళ్లలో అందేలా ఆహారపు అలవాట్లు ఉండాలని సూచించారు. పూర్వం మన అమ్మమ్మలు, నాయనమ్మలు రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను తీసుకోవడం వలనే ఆరోగ్యంగా, బలంగా ఉండేవారని గుర్తుచేశారు. ప్రస్తుత కాలంలో చిరుధాన్యాలను పక్కన పెట్టి కేవలం వరి అన్నం మాత్రమే తింటున్నామని, చిరుధాన్యాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పచ్చని పండ్లు, పాలు, కోడిగుడ్లు వంటి పౌష్టికాహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలని కోరారు. అంగన్వాడి కార్యకర్తలు సుజాత, అమీనా, రాజేశ్వరి తదితరులు ఉన్నారు.