BREAKING
శివాలయంలో  బారులు తీరిన భక్తులు టాలీవుడ్ పుట్టుక నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు.. తెలుగు సినిమా ప్రస్థానంలో ఇన్ని మార్పులా! జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో రొంగల అనూష కోదాడ నియోజకవర్గo లో పల్లె రహదారులకు మహార్దశ.జీవో ఆర్టీ నంబర్ 533 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సాయిపల్లవి సీక్రెట్‌ను బయటపెట్టిన నాగచైతన్య.. టాక్ షోలో సరదా విషయాలు వెల్లడి అనకాపల్లి జిల్లా ప్రజా పరిషత్ సీఈవోగా సత్యనారాయణ డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

వేమూరు ప్రభుత్వ వైద్యశాలలో మెగా వైద్య శిబిరం

Select Suryaa Now
వేమూరు ప్రభుత్వ వైద్యశాలలో మెగా వైద్య శిబిరం

వేమూరు (భట్టిప్రోలు), మేజర్ న్యూస్: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్” కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేమూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరంను నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు 25 ఎళ్ల సుదీర్ఘ అనుభవంతో ప్రధాని మోడీ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు. ఈ మెగా వైద్య శిబిరంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వివిధ వైద్య విభాగాలకు చెందిన సేవలను అందుబాటులో ఉంచారన్నారు. ఇందులో భాగంగా రక్త పరీక్షలు, కంటి పరీక్షలు, ఎక్స్‌రే, హెచ్‌ఐవీ కౌన్సెలింగ్, ఫిజియోథెరపీ, ప్రసూతి మరియు శిశు వైద్య సేవలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద బాబు ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల వివరాలను తెలుసుకుని, వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని, వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందాలని, తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల ముందస్తు గుర్తింపు, అవసరమైన వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే ఈ మెగా వైద్య శిబిరం ప్రధాన ఉద్దేశమన్నారు, సమావేశంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్, జొన్నలగడ్డ విజయబాబు, హాస్పటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు వేల్పుల రవి ప్రసాద్, వైద్యాధికారులు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.