వెంకటేశ్వరంలో ఎస్‌డీపీఐ అభ్యర్థుల ప్రచారం.. భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి!
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 71వ వార్డు ఎస్‌డీపీఐ బలపరిచిన అభ్యర్థి షేక్ మునావర్ జాన్ వెంకటేశ్వరం ప్రాంతంలో ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు. ఆమెకు స్థానికుల నుంచి స్పందన లభించింది. ఎస్‌డీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మొహమ్మద్ ఘనీ సతీమణి అయిన షేక్ మునావర్ జాన్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. 71వ వార్డు అభ్యర్థి షేక్ మునావర్ జాన్ — గ్యాస్ సిలిండర్ గుర్తు, క్రమ సంఖ్య 7.
అదేవిధంగా ఎస్‌డీపీఐ బలపరిచిన నెల్లూరు మేయర్ అభ్యర్థి అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ కూడా వెంకటేశ్వరంలో ప్రచారం నిర్వహించారు. కోవిడ్ సమయంలో, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎస్‌డీపీఐ చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మేయర్ అభ్యర్థి అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ — కుట్టు మిషన్ గుర్తు, క్రమ సంఖ్య 14. ఈ సందర్భంగా ఇద్దరు అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి, భారీ ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని ఎస్‌డీపీఐ నాయకులు, కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు.