వెంకటాచలం జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి
వెంకటాచలం మేజర్ న్యూస్ : మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగాయి. వెంకటాచలం జిల్లా పరిషత్ పాఠశాలలో చైర్‌పర్సన్‌గా తురక పూజిత, వైస్ చైర్మన్‌గా యటగిరి హరిబాబు ఎన్నికయ్యారు. మరో 13 మంది సభ్యులు కూడా ఎన్నికయ్యారు.అదేవిధంగా గుడ్లూరువారిపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్‌గా వినోద్, వైస్ చైర్మన్‌గా కల్పన ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య, భోజనం, పారిశుధ్య వసతులు కల్పించడంతో పాటు పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సండే రమేష్, రాజేంద్ర, మాజీ ఎంపీటీసీ చాట్ల వెంకటసుబ్బయ్య, అశోక్, బాబీ తదితరులు పాల్గొన్నారు.