వీరవల్లి పాలెంలో ఉద్రిక్తత మోటార్ సైకిల్ దగ్ధం
అయినవిల్లి మేజర్ న్యూస్ :బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వీరవెల్లిపాలెం గ్రామంలో శనివారం రాత్రి ఫలితాలు వెలువడిన తర్వాత తెలుగుదేశం చెందిన ఒక నాయకుని మోటార్ సైకిల్ దగ్ధమైంది దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది ఈ మోటార్ సైకిల్ తెలుగుదేశం నాయకుడిగా తెలిసింది
అదే గ్రామానికి చెందిన టిడిపి నాయకులు దామిశెట్టి సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు కట్టి దర్యాప్తు జరుగుతున్నామని అయినవిల్లి పోలీసులు తెలిపారు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది ఎంపీటీసీ స్థానానికి జనసేనకు చెందిన ఎర్రం శెట్టి వీర వెంకట సత్యవాణి గెలుపొందారు ఒకే సామాజిక వర్గంలో ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి