BREAKING
తిరుమలలో మంత్రి నారా లోకేష్ SIR ప్రక్రియపై నేడు కాంగ్రెస్ నిరసన రబ్బీలో గంగాయపల్లె విద్యార్థుల సత్తా రాష్ట్రస్థాయి పోటీలకు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు - ఇద్దరు ఎంపిక ప్రిన్సిపాల్ సురేష్ అభినందనలు.. స్థానిక సమరంలో జనసేన సత్తా చాటుతాం! - మెజారిటీ స్థానాల్లో పోటీకి వ్యూహరచన - కడప కార్పొరేషన్లో 18-19 స్థానాల్లో పోటీకి సన్నాహాలు - విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.. ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు ఖోఖోలో - ప్రతిభ రాష్ట్రస్థాయి ఖోఖోకు ఇద్దరు విద్యార్థినులు.. గంగాయపల్లిలో చెత్త బుట్టలు, బ్యాగుల వినియోగంపై - ఇంటింటా అవగాహన డిప్యూటీ ఎంపీడీవో రమేష్.. వేదాస్ విద్యార్థుల విజయం.. గట్కాలో మెరిసిన వేదాస్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురి ఎంపిక.. వల్లూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం రేపు రిమ్స్ లో మెగా వైద్య శిబిరం వైద్యాధికారి కె.వినయ్ కుమార్ రెడ్డి నేటి తిరుమల సమాచారం నేటి ద్వాదశ రాశి ఫలాలు నేటి పంచాంగం నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు మరింత విస్తరణ : మంత్రి సత్యకుమార్ యాదవ్ రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు---*మంత్రి నారాయణ

వేదాస్ విద్యార్థుల విజయం.. గట్కాలో మెరిసిన వేదాస్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురి ఎంపిక..

Select Suryaa Now
వేదాస్ విద్యార్థుల విజయం..  గట్కాలో మెరిసిన వేదాస్ విద్యార్థులు  రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురి ఎంపిక..

వేదాస్ విద్యార్థుల విజయం..

గట్కాలో మెరిసిన వేదాస్ విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురి ఎంపిక..

వల్లూరు మేజర్ న్యూస్

గట్కా క్రీడలో వేదాస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. సోమవారం  చెన్నూరు మండలం రామునపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అండర్‌ - 17 గట్కా ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో వేదాస్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. విద్యార్థులు నీతు, ధర్మిత, నాగచైతన్య, వెంకట నాగ గౌతమ్‌కృష్ణ జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. అక్టోబరు 9, 10 తేదీల్లో విజయవాడలోని జగ్గయ్యపేటలో నిర్వహించనున్న అండర్‌ - 17 రాష్ట్రస్థాయి గట్కా పోటీల్లో వీరు పాల్గొననున్నారు. వేదాస్ పబ్లిక్ స్కూల్‌లో గట్కా క్రీడకు మాస్టర్ జయచంద్ర శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో విద్యార్థులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ జిల్లా స్థాయి ఎంపికల్లో సత్తా చాటి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ధీరజ్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి సరైన శిక్షణ అందిస్తే వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. గట్కాలో మన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణం. క్రీడల్లో రాణించడంతోపాటు చదువులోనూ ముందుండేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం అని. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి వేదాస్ పబ్లిక్ స్కూల్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాం అని అన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను వేదాస్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లో విజయవంతంగా రాణించాలని కోరారు..