BREAKING
నంద్యాలలో ఘనంగా యువజన ఉత్సవాలు -యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా, సాంస్కృతిక పోటీలుజిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా కమర్షియల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న నందమూరి మోక్షజ్ఞ.. ప్రత్యేక శిక్షణతో పూర్తి సిద్ధం! ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు.. ఖాతాలో తొమ్మిదో స్వర్ణం రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు గన్నవరం కళాశాల విద్యార్థిని గాంధీ జయంతి వేడుకలకు ఎంపికైన ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందనలు కళ్యాణ్ లక్ష్మి, స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన భద్రాచలం ఎమ్మెల్యే పాఠశాలల కాంపౌండ్‌ వాల్స్‌కు రూ.8 కోట్ల CSR నిధులు ఇవ్వండి* *HPCL RMను కోరిన మంత్రి సవిత* .20.87 కోట్లతో బుక్కపట్నం మండలంలో 53 అభివృద్ధి పనులకు శ్రీకారం: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పల్లెపండుగ 3.o రేపు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కీలక ప్రెస్‌మీట్ ఏపీలో పెన్షన్‌దారులకు శుభవార్త.. అక్టోబర్‌ 1 నుంచే పంపిణీ ధ్రువీకరణ పత్రాల రీ-ఇష్యూ నిలిపివేత ఈ-చలానాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో నిరసన సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఆత్రం సుగుణక్క అంత్యక్రియలకు 5000 రూపాయల ఆర్థిక సహాయం

ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు ఖోఖోలో - ప్రతిభ రాష్ట్రస్థాయి ఖోఖోకు ఇద్దరు విద్యార్థినులు..

Select Suryaa Now
ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు ఖోఖోలో - ప్రతిభ  రాష్ట్రస్థాయి ఖోఖోకు ఇద్దరు విద్యార్థినులు..

ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు ఖోఖోలో - ప్రతిభ

రాష్ట్రస్థాయి ఖోఖోకు ఇద్దరు విద్యార్థినులు..


వల్లూరు మేజర్ న్యూస్

వల్లూరు మండలం గంగాయపల్లె పీఎం శ్రీ ఏపీ మోడల్‌ స్కూల్‌ అండ్‌ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. పులివెందులలోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌ - 19 బాలికల ఖోఖో ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతున్న బి. పద్మశ్రీ, ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న ఎస్‌. చందన రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్‌ సురేష్‌బాబు హర్షం వ్యక్తం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయం. రాష్ట్రస్థాయికి ఎంపికైన మన విద్యార్థినులు మరింత కృషి చేసి పాఠశాలకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి. వారి ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఎల్లప్పుడూ అందిస్తాం అని అన్నారు. విద్యార్థినులను కళాశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయురాలు సుశీలమ్మ అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు..