BREAKING
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు! తిరుమలలో మంత్రి నారా లోకేష్ SIR ప్రక్రియపై నేడు కాంగ్రెస్ నిరసన రబ్బీలో గంగాయపల్లె విద్యార్థుల సత్తా రాష్ట్రస్థాయి పోటీలకు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు - ఇద్దరు ఎంపిక ప్రిన్సిపాల్ సురేష్ అభినందనలు.. స్థానిక సమరంలో జనసేన సత్తా చాటుతాం! - మెజారిటీ స్థానాల్లో పోటీకి వ్యూహరచన - కడప కార్పొరేషన్లో 18-19 స్థానాల్లో పోటీకి సన్నాహాలు - విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.. ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు ఖోఖోలో - ప్రతిభ రాష్ట్రస్థాయి ఖోఖోకు ఇద్దరు విద్యార్థినులు.. గంగాయపల్లిలో చెత్త బుట్టలు, బ్యాగుల వినియోగంపై - ఇంటింటా అవగాహన డిప్యూటీ ఎంపీడీవో రమేష్.. వేదాస్ విద్యార్థుల విజయం.. గట్కాలో మెరిసిన వేదాస్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురి ఎంపిక.. వల్లూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం రేపు రిమ్స్ లో మెగా వైద్య శిబిరం వైద్యాధికారి కె.వినయ్ కుమార్ రెడ్డి నేటి తిరుమల సమాచారం నేటి ద్వాదశ రాశి ఫలాలు నేటి పంచాంగం నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు మరింత విస్తరణ : మంత్రి సత్యకుమార్ యాదవ్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

Select Suryaa Now
తిరుమలలో మంత్రి నారా లోకేష్

 

*సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి*

ఏపీ సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : 

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉదయం సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు సోమవారం రాత్రి తిరుమల చేరుకున్న సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంకు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం ఈ ఉదయం గౌరవ మర్యాదలతో షణ్ముగంను శ్రీవారి దర్శనానికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. ఇరువురు కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు సోమవారం రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు.